https://oktelugu.com/

Naga Chaitanya Samantha Divorce : చైతన్య-సమంత విడాకులు ట్రెండింగ్.. సినీ నటుల పోటాపోటీ పోస్టులు

Naga Chaitanya Samantha Divorce : సినీ నటుల పెళ్లిళ్లు ఎక్కువ కాలం సాగలేవని మరోసారి అర్థమైంది. ఇప్పటి వరకు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన వారెందరో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత కొంత కాలానికే విడాకులు తీసుకున్నారు. ఆ లిస్టులో తాజాగా నాగచైతన్య- సమంత చేరారు. తాజాగా నాగచైతన్య తాము విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సినిమా నటులంతా చైతన్య, సమంతల గురించే మాట్లాడుతున్నారు. మీడియా మొత్తం ఈ విషయంపైనే […]

Written By:
  • NARESH
  • , Updated On : October 3, 2021 / 09:54 AM IST
    Follow us on

    Naga Chaitanya Samantha Divorce : సినీ నటుల పెళ్లిళ్లు ఎక్కువ కాలం సాగలేవని మరోసారి అర్థమైంది. ఇప్పటి వరకు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన వారెందరో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత కొంత కాలానికే విడాకులు తీసుకున్నారు. ఆ లిస్టులో తాజాగా నాగచైతన్య- సమంత చేరారు. తాజాగా నాగచైతన్య తాము విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సినిమా నటులంతా చైతన్య, సమంతల గురించే మాట్లాడుతున్నారు. మీడియా మొత్తం ఈ విషయంపైనే ఫోకస్ పెట్టింది. ఇక సోషల్ మీడియాలో వీరి వివాహ బంధంపై రచ్చ రచ్చ అవుతోంది. ట్వీట్లు, మెసేజ్ లో కొందరు ట్రెండింగ్ గా నిలుస్తారు. అయితే కొందరు సినీ నటులు కూడా నాగ్, సమంతల గురించి హాట్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

    నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించగానే అభిమానులు కాస్త నిరాశ చెందారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇదే విషయంపై పోస్టులు రావడంతో అభిమానులు వాటిపై స్పందించారు. తమ హీరో ఎప్పటికీ ఆ పని చేయరని పోస్టులు పెట్టారు. కానీ ఎవరూ ఊహించని విధంగా నాగ చైతన్య తన వివాహ బంధం గురించి మాట్లాడడంతో ఫ్యాన్స్ హర్టయ్యారు. అయితే కొందరు మంచి పని చేశావని అంటుండగా.. మరికొందరు మాత్రం ఆవేదనకు గురవుతున్నారు.

    ఈ తరుణంలో సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం స్పందించారు. పెళ్లి, విడాకులు జీవితంలో కామన్ అన్నారు. విడాకులు తీసుకోవడం అంటే మళ్లీ పుట్టడమే అని శుభాకాంక్షలు అని చెప్పారు. దీంతో ఆర్టీవి పోస్టులపై నాగ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే కొందరు బాధపడుతుంటే ఆర్జీవి సంతోషపడుతారని, దీనినే రాక్షసానందం అంటారని కామెంట్లు పెడుతున్నారు. మరో నటి కస్తూరి శంకర్ కూడా స్పందించారు. నాగ చైతన్య విడాకుల విషయం బాధించిందన్నారు.

    ఇక హీరో సిద్ధార్థ ఈ విషయంపై స్పందించారు. అప్పటికే విడాకుల విషయం ట్రెండ్ అవుతుండడంతో సిద్దార్థ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ‘ కొందరు మోసం చేసిన వారు ఎప్పటికీ బాగుపడలేరు.. స్కూల్లో టీచర్లు నేర్పిన పాఠం ఇదే ’ అన్న ట్యాగ్ తో ఎమోజీపెట్టాడు. కొద్దిసేపట్లోనే సిద్దార్థ పెట్టిన పోస్టు వైరల్ అయింది. దీంతో మరో నటి పూనమ్ కౌర్ సిద్దార్థ పోస్టుకు రెస్పాన్స్ ఇచ్చింది. ఆయన పెట్టిన పోస్టుకు ‘అవును నిజమే..’ అని రిప్లై ఇచ్చింది.

    చైతన్య, సమంత విడాకుల విషయం ట్రెండింగ్ గా మారింది. చాలా మంది నటులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టడంతో నెట్టింట్లో ఇదే విషయం హాట్ టాపిక్ గామారుతోంది. ‘ఏమాయ చేశావే’ సినిమాతో తెరంగేట్రం చేసిన చై, సమంతలు ఆ తరువాత ప్రేమికులుగా మారారు. ఇద్దరి మతాలు వేరైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం సజావుగా కలిసున్నా నెల రోజుల నుంచి వీరి విడాకులపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇటీవల సమంత తాను హైదరాబాద్ ను విడిచి వెళ్లలేనని, తాను ఎప్పటికీ హైదరాబాద్ కోడలినేనని ప్రకటించింది. ఆమె ప్రకటించిన కొద్దిరోజులకే నాగచైతన్య ఇలా ప్రకటన చేయడంపై ఫిల్మ్ నగర్లో విషాదంగా భావిస్తున్నారు.

    సినీ ఇండస్ట్రీలోని కొందరు నాగచైతన్యకు ప్రత్యేకంగా ఫోన్లు చేసి కారణం తెలుసుకుంటున్నారు. కారణం ఏదైనా సినీ లవర్స్ విడిపోయిన వారిలో వీరు కూడా చేరడం ఆవేదన మిగిల్చిందని నాగ్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఈ విషయంపై సమంత ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి సమంత ఏ విధంగా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.