Samantha: నాగచైతన్య – సమంత విడిపోతున్నారనే పుకార్లు నిజమయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో సమంత గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. క్యాస్టింగ్ కౌచ్ దగ్గర నుంచి ఫుడ్, సెక్స్ సహా అన్నింటి పై సమంత తనదైన అభిప్రాయాన్ని గతంలో తేల్చి చెప్పింది. నిత్యం సోషల్ మీడియాలో నెటిజన్లతో టచ్ లో ఉండే సమంత కొన్ని క్రేజీ కామెంట్స్ చేసింది. వివిధ సందర్భాల్లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఇలా సమాధానాలు ఇచ్చింది.

తాను ఆహారం కంటే కూడా ఎక్కువ సెక్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని సమంత పబ్లిక్ గా చెప్పడం షాకింకే. ఇలాంటి సంచలన స్టేట్ మెంట్ ఇవ్వడానికి సమంత పర్సనల్ లైఫ్ లోని అనుభవాలే కారణం అంటూ నెటిజన్లు కూడా ఘాటుగా చర్చ మొదలుపెట్టారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీని ఊపేసిన కాస్టింగ్ కౌచ్ పై కూడా సామ్ హాట్ కామెంట్ చేయడం విశేషం.
సినిమా ఇండస్ట్రీలో కొందరు ద్రోహులు, దుర్మార్గులు ఉన్నారు. వాళ్లు ఎప్పటికైనా సర్వ నాశనమైపోతారు అంటూ సమంత చెప్పుకొచ్చింది. టాలీవుడ్ లో సినీ ప్రముఖుల గురించి సామ్ ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వడం అంటే.. మామూలు విషయం కాదు. ఇక తన విడాకుల పై కూడా సామ్ చాలా స్పష్టతతో ఉంది. నో కాంప్రమైజ్. ఎవరి దారి వారిదే. నాలుగేళ్ల బంధం విచ్ఛిన్నమైంది.
మా చూడముచ్చటైన నిండు నూరేళ్ల జీవితం మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది ఇక దీని గురించి అనవసరమైన అభిప్రాయాలు అనవసరం. ఒక్కోసారి బలమైన బంధాలు, బంధుత్వాలు కూడా ఒంటరిగా మిగిలి పోవాల్సి వస్తోంది అంటూ సామ్ తెలియజేసింది. పదేళ్ల పాటు స్నేహం చేసి పెళ్లి చేసుకున్న తాము ఇలా మధ్యలోనే విడిపోతామని ఊహించలేదు అంటుంది సమంత.
ఇక తన ప్రెగ్నేన్సీ పై కూడా సామ్ ఓ సందర్భంలో హాట్ కామెంట్స్ చేసింది. 2017 నుంచి తాను గర్బవతిగా ఉన్నాను అని, కాని ఆ బిడ్డ మాత్రం బయటకు రావడం లేదని కామెంట్ చేసింది. ఇంటరాక్టివ్ సెషన్ లో అభిమానులకు సమంత ఇచ్చే సమాధానాలు ఇలా సాగేవి. అయితే, ఈ కామెంట్స్ వినపుడల్లా అక్కినేని ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉండేవాళ్లు.