Cat
Cat: స్టంట్స్.. అంటే మనకు సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ స్టంట్స్ అన్నీ నిపుణుల పర్యవేక్షణలోనే చేస్తారు. రియాలిటీలో కూడా కొన్నిసార్లు స్టంట్స్ చూస్తుంటాం. కానీ వాళ్లు ఎన్నో ఏళ్లు సాధన చేస్తేగానీ సాధ్యం కాదు. అయినా ఒక్కోసారి పొరపాట్లు చేస్తుంటారు. ఇక అదిరిపోయే స్టంట్స్ ఉన్న సినిమా లెజెండరీ టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్. ఇది ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. సినిమాలోని స్టంట్స్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అయితే అంతకు మించిన స్టంట్స్ చేస్తోంది ఇక్కడ ఓ పిల్లి. సినిమాలోని యాక్షన్, ప్యాక్ట్ సన్నివేశాలను గుర్తు చేస్తోంది. పిల్లి స్టంట్స్‌కు సంబందించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పిల్లి స్టంట్స్ చూసి షాక్ అవుతున్నారు. ప్రొఫెషనల్ స్టంట్ పెర్ఫార్మర్స్‌లా చేస్తోందని కామెంట్ చేస్తున్నారు.
36 లక్షల వ్యూస్..
పిల్లి స్టంట్స్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, దాదాపు 36 లక్షల మంది దానిని చూశారు. వీడియో ఓపెన్ చేస్తే పిల్లి చాలా ఎత్తులో పక్కపక్కనే ఉన్న రెండు సన్నటి పైపులపై నడుచుకుంటూ కనిపిస్తుంది. అద్భుతమైన బ్యాలెన్స్ మెయింటేన్ చేస్తుంది. కంట్రోల్‌ను చూపుతుంది. చాలా ఎత్తులో.. ప్రమాదకరమైన మార్గం అయినా.. ఎమాత్రం బెరుకు లేకుండా పిల్లి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో నడవడం అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. పిల్లి ధైర్యాన్ని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన ఎక్స్ పేజీ జోక్‌గా ‘మిషన్ ఇంపాజిబుల్‘ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది.
నెటిజన్స్ ఫిదా..
ఈ వీడియోలో పిల్లి చేష్టలకు వ్యూయర్స్ ఫిదా అవుతున్నారు. కొంతమంది పిల్లి ప్రవర్తన చాలా విలక్షణంగా ఉందని కామెంట్ చేశారు. మరికొందరు పిల్లి తెగువ గ్రేట్ అంటున్నారు. మరో నెటిజన్ పిల్లి మిషన్ సీక్రెట్‌లో ఉన్నట్లు ఉంది అని కామెంట్ చేశాడు. క్లిష్టమైన పరిస్థితులను, సాహసాలుగా మార్చగల పిల్లి సామర్థ్యం నెక్ట్స్ లెవల్ అంటున్నారు. మరో నెటిజన్ పిల్లికి మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ ఇచ్చినట్లు ఉన్నారు. అందుకే ధైర్యంగా స్టంట్స్ చేస్తోంది అని కామెంట్ చేశాడు.
Mission impawsible.. 😅 pic.twitter.com/MYpcctzNa0
— Buitengebieden (@buitengebieden) January 2, 2024
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
View Author's Full InfoWeb Title: Cat mission impossible viral video
Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News