Beggars on Phone Pe : ఇక బిచ్చగాళ్ల నుంచి తప్పించుకోలేరు..

అసలు తప్పించుకునే మార్గం లేకపోవడంతో కొందరు ఫోన్ పే లేదంటూ తప్పుకున్నారు. మరికొందరైతే తప్పనిసరి పరిస్థితుల్లో చిల్లరను ఫోన్ పే ద్వారా చెల్లించారు. ఇప్పుడు ఈ దృశ్యాలే వైరల్ అవుతున్నాయి. మిగతా బిచ్చగాళ్లు కూడా దీనినే అనుసరిస్తున్నారు.

Written By: Dharma, Updated On : July 5, 2023 12:49 pm
Follow us on

Beggars on Phone Pe : బిచ్చగాళ్లకు ఎంతో కొంత బిచ్చం వేయాల్సిందే. చిల్లర లేదని పొమ్మనమని చెప్పడం కుదరదు ఇక. జేబులో చిల్లర లేకున్నా ఫోన్ పే చేయ్యాల్సిందే. అన్ని ప్రొఫెషన్ల మాదిరిగా భిక్షాటనలో కూడా టెక్నాలజీ వచ్చేసింది. చిల్లర సమస్య అధిగమించేందుకు డిజిటల్ పేమంట్లకు బిచ్చగాళ్లు ప్రాధాన్యమిస్తున్నారు. ఏకంగా క్యూఆర్ కోడ్ పట్టుకొని బిచ్చమడుక్కుంటున్నారు. ఇప్పుడిదే సోషల్ మీడియా వైరల్ ట్రెండ్. ముంబాయ్ లోని లోకల్ ట్రైన్ లో ఇటువంటి బిచ్చగాళ్లు ఇప్పుడు కనిపిస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల బిచ్చగాళ్లు వీరిని అనుసరించడం ప్రారంభిస్తున్నారు.

బిచ్చమెత్తడం ఎంత కష్టమో విజయ్ అంటోనీ ‘బిచ్చగాడు’ సినిమాలో చూశాం. పొద్దున్నే బేవర్సు గాళ్లు ఎక్కవైపోయారు అంటూ పోకిరి సినిమాలో బ్రాహ్మనందం బిచ్చగాడు ఆలీని చూసి విసుక్కుంటాడు. ఆ తరహాలో కాకున్నా వివిధ పనుల మీద ఉన్నవారు బిచ్చగాళ్ల విషయంలో ఇలానే వ్యవహరిస్తుంటారు. కాస్తా వయసు మళ్లిన, మహిళలు, వృద్ధుల విషయంలో కనికరిస్తారు. వయసులో ఉండే వారు అడుక్కుంటే మాత్రం ఇట్టే విసుక్కుంటారు. ఏం చెప్పాలో తెలియక చిల్లర లేదంటూ సమాధానమిస్తుంటారు. అందుకే ముంబాయ్ లోని ఓ బిచ్చగాడు వినూత్న ఆలోచన తెరపైకి తెచ్చాడు.

లోకల్ ట్రైన్ లో సెడన్ గా ప్రత్యక్షమయ్యాడు. పాటలు పాడుకుంటూ యాచించడం ప్రారంభించాడు. దీంతో అక్కడున్న వారంతా.. అయ్యో చిల్లర లేదే? అంటూ నిట్టూర్చారు. అలా అయితే ఫోన్ పే ఉందంటూ క్యూఆర్ కోడ్ చూపించేసరికి వారు అవక్కయ్యారు. అసలు తప్పించుకునే మార్గం లేకపోవడంతో కొందరు ఫోన్ పే లేదంటూ తప్పుకున్నారు. మరికొందరైతే తప్పనిసరి పరిస్థితుల్లో చిల్లరను ఫోన్ పే ద్వారా చెల్లించారు. ఇప్పుడు ఈ దృశ్యాలే వైరల్ అవుతున్నాయి. మిగతా బిచ్చగాళ్లు కూడా దీనినే అనుసరిస్తున్నారు.