Vaamu Aaku Benefits: మన ప్రాణాలను కాపాడే సంజీవిని లాంటి మొక్కలు ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి. కానీ వాటి ప్రత్యేకతలను మనం తెలుసుకోవడం లేదు. దీంతోనే మనం రోగాల బారిన పడుతున్నాం. మన పూర్వీకులు మొక్కల్లోని ఔషధ గుణాలు తెలుసుకుని వాడుకుని వారు రోగాలు లేకుండా హాయిగా జీవించారు. కానీ ఇప్పుడు మనకు పాతికేళ్లకే అన్ని జబ్బులు వచ్చేస్తున్నాయి. నూరేళ్లు బతకాల్సిన శరీరాన్ని యాభై ఏళ్లకే కుదిస్తున్నాం. దీంతో రోగాల బారిన పడి చనిపోతున్నాం. కానీ మన విధానాలు మాత్రం మారడం లేదు. మన పద్ధతులు మాత్రం మార్చుకోవడం లేదు. అందుకే తగిన ఫలితం అనుభవిస్తున్నాం.
ప్రస్తుతం వాము ఆకు గురించి తెలుసుకుందాం. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. కడుపునొప్పిని నయం చేయడానికి వీటి ఆకుల రసం తాగితే ఉపశమనం కలుగుతుంది. మన పూర్వీకులు ఇలాంటి చిట్కాల తోనే వందేళ్లు జీవించారు. రక్తాన్ని శుద్ధి పరుస్తాయి. మలబద్ధకాన్ని లేకుండా చేస్తాయి. చర్మ సంబంధ వ్యాధులు రాకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తలలో చుండ్రును కూడా దూరం చేస్తాయి.
దీని ఆకులతో పప్పు కూడా చేసుకుంటారు. దగ్గు, జలుబు, శ్వాస కోశ వంటి వ్యాధులకు ఉపశమనం కలిగిస్తాయి. అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఈ ఆకుల్లో ఉండే పోషకాల వల్ల మన ఆరోగ్యానికి మేలు చేసేవిగానే ఉంటాయి. అందుకే వీటిని వాడుకోవడం మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇంతటి విలువైన ఆకులు దొరికితే విడిచిపెట్టకండి.
మనకు ప్రకృతిలో లభించే వాటితో మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. మనమే వాటిని గుర్తించకుండా పో తున్నాం. దీంతో మన అనారోగ్యాలను మనమే పెంచి పోసిస్తున్నాం. ఇలాంటి ఆకులను వాడుకుని మన శరీరంలోని రోగాలను దూరం చేసుకునేందుకు ప్రయత్నించడం మంచిది. ఆకుల విలువ తెలుసుకుంటే ఎప్పటికైనా అవి మనకు సంజీవనిలా మేలు చేస్తాయని గుర్తుంచుకోవాలి.