https://oktelugu.com/

Niharika- Chaitanya: మొదట విడాకులు అప్లై చేసింది ఎవరు? మీడియాకు నిహారిక-చైతన్య షాకిచ్చారు

నిహారిక-చైతన్య జొన్నల గడ్డలు కొన్ని నెలలుగా దూరంగా ఉంటున్నట్లు మీడియాకు సమాచారం అందింది. దీంతో వీరు విడిపోతున్నారని కొందరు ప్రసారం చేశారు. మరికొందరు మాత్రం అవి ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశారు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 5, 2023 / 12:46 PM IST

    Niharika- Chaitanya

    Follow us on

    Niharika- Chaitanya: కోట్లు ఖర్చు పెట్టి వారం రోజులుగా వైభవంగా జరుపుకునే పెళ్లిళ్లు.. ఈ కాలంలో రోజులు గడవకముందే పెటాకులు అవుతున్నాయి. చిన్న కారణాలతో వందేళ్లు కలిసుండాల్సిన వాళ్లు అర క్షణం ఆలోచించకుండా విడాకులు తీసుకుంటున్నారు. పెళ్లిళ్లు చేసుకోవడం.. నచ్చకపోతే విడిపోవడం ఈరోజుల్లో పెద్ద విషయం కాదు. కానీ సెలబ్రెటీల విషయంలో చాలా మందికి ఉత్సాహం ఉంటుంది. సినీ పరిశ్రమకు చెందిన వారి పెళ్లిళ్లు అయినా.. వారికి బిడ్డ పుట్టినా.. చివరికి వారు విడిపోయినా రోజుల తరబడి మీడియాలో హాట్ హాట్ గా చర్చ సాగుతుంది. మెగా డాటర్ నిహారిక విషయంలోనూ ఇదే జరిగింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలైన విషయాన్ని మీడియాకు చెప్పకుండా నిహారిక ఫ్యామిలీ సీక్రెట్ గా ఉంచింది. ఇది తెలియక మీడియా లో నిహారిక, చైతన్య దూరమవుతున్నారా? అసలేం జరుగుతుంది? అనే వార్తలు ప్రసారం చేశారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే?

    నిహారిక-చైతన్య జొన్నల గడ్డలు కొన్ని నెలలుగా దూరంగా ఉంటున్నట్లు మీడియాకు సమాచారం అందింది. దీంతో వీరు విడిపోతున్నారని కొందరు ప్రసారం చేశారు. మరికొందరు మాత్రం అవి ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశారు. కానీ నిహారిక గానీ.. అటు చైతన్య నుంచి గానీ ఎలాంటి విషయం బయటకు రాలేదు. అయితే నిహారిక మాత్రం సోషల్ మీడియాలో తన లేటేస్ట్ ఫొటోలు పెడుతూ హల్ చల్ చేశారు. మరోవైపు అంతకుముందు నిహారిక జొన్నలగడ్డ అని ఉన్న పేరును నిహారిక కొణిదెల గా మార్చుకున్నారు. దీంతో నిహారిక విడాకులు తీసుకుంటున్నట్లు అర్థమైంది.

    తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు అధికారికంగా నిహారిక-చైతన్య జొన్నలగడ్డలు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి జరిగిందేంటే.. అసలు వీరు విడాకులు కోసం నెల కిందటే దరఖాస్తు చేస్తున్నారు. మొదటగా విడాకులు కావాలని చైతన్య జొన్నలగడ్డ దరఖాస్తు చేశాడట. ఆ తరువాత ఏప్రిల్ 1న నిహారిక తరుపున న్యాయవాది అయిన దిలీప్ సుంకర పిటిషన్ వేశారు.

    ఆ తరువాత మే 19న దీనిపై విచారణ జరిగింది. రెండోసారి 29న హియరింగ్ చేశారు. మూడోసారి జూన్ 5న జరగడంతో ఇక విడాకులు తీసుకోవడం తప్పని సరి అని నిర్ణయించుకున్నారట. అయితే ఈ విషయాన్ని మీడియాకు లీక్ కాకుండా జాగ్రత్తపడ్డారు. అప్పుడే బయటకు ఈ విషయం తెలిస్తే హల్ చల్ ఉంటుందని పూర్తిగా విడాకులు వచ్చేవరకు దాచారు. కానీ మీడియా సంస్థలకు ఈ విషయం తెలియక తమకిష్టం వచ్చిన వార్తలు వేశారని కొందరు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.