Latest News In Chennai: ఇటీవల కాలంలో నైతిక విలువలు అనేవి మచ్చకైనా లేకుండా పోతున్నాయి. భారత సమాజం అత్యంత పవిత్రంగా భావించే ‘పెళ్లి’ చేసుకున్న కొందరు.. విలువలకు తిలోదకాలిస్తున్నారు. వివాహేతర సంబంధాలు పెట్టుకుని తమ జీవితాన్ని తామే నాశనం చేసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఇక్కడ కట్టుకున్న భర్త తన చెల్లెలి నగ్న వీడియోలు తీసి వక్రబుద్ధి చూపించాడు. తన చెల్లెవి మాత్రమే కాకుండా వారు ఉంటున్న అపార్టుమెంటులోని మహిళలు స్నానం చేసే వీడియోలు, నగ్న వీడియోలను ఫోన్ లో చిత్రీకరించాడు. ఈ విషయం తెలుసుకుని హడలిపోయిన భార్య.. భర్తకు బుద్ధి చెప్పింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

తమిళనాడులోని చెన్నై సిటీ.. పుదువన్నార్ పేట్‌కు చెందిన శేఖర్‌కు మూడేళ్ల కిందట ప్రతీకా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు చూసిన సంబంధం కాగా, అమ్మాయి నచ్చి శేఖర్ పెళ్లికి ఓకే చెప్పాడు. ఇకపోతే వీరిరువురు చూడ ముచ్చటగా ఉంటారని స్థానికులు చెప్తుంటారు. అలా కొంత కాలం వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే, శేఖర్ భార్య చెల్లెలు అనగా శేఖర్‌కు మరదలు ఉంది. ఆమెపైన కన్నేసిన.. ఆమె ఇంటికి వచ్చినపుడు క్లోజ్ గా ఉండేవాడు. అయితే, కొంత కాలానికి శేఖర్ వ్యవహారం మితిమీరింది.
Also Read: పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా..ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే జీవితమే మారిపోతుంది!
ఒక రోజు శేఖర్ భార్య చెల్లెలు ఇంటికి వచ్చిన క్రమంలో శేఖర్ అనుచితంగా ప్రవర్తించాడు. తన మరదలు స్నానం చేస్తుండగా, నగ్న వీడియోలు తీసేందుకుగాను ప్రయత్నించాడు. అనుమానం వచ్చిన శేఖర్ మరదలు, శేఖర్ భార్యకు విషయం చెప్పింది. దాంతో శేఖర్ భార్య, శేఖర్ ఫోన్ చెక్ చేయగా, అందులో తన చెల్లెలి నగ్న వీడియోతో పాటు అపార్టుమెంటులోని మహిళల నగ్న వీడియోలు ఉన్నాయి.
అవి చూసి ఖంగుతిన్ని ఆమె..ఈ వీడియోలు ఎక్కడివి అని ప్రశ్నించగా కాకమ్మ కథలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరకు శేఖర్ భార్యనే స్వయంగా వెళ్లి పోలీసులకు ఈ విషయమై కంప్లయింట్ చేసింది. దాంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సొంత భర్త తప్పులపైన కేసు పెట్టిన ప్రతీకాను చెన్నై మహిళా సంఘాలు అభినందించాయి.
Also Read: పెండ్లిలో చిచ్చు రేపిన పూలదండ.. చివరకు ఇంత దారుణమా..!