Homeఎంటర్టైన్మెంట్NTR30: బిగ్ అప్డేట్.. ‘NTR30’ లాంచింగ్ డేట్ ఫిక్స్?

NTR30: బిగ్ అప్డేట్.. ‘NTR30’ లాంచింగ్ డేట్ ఫిక్స్?

NTR30: ‘ఆర్ఆర్ఆర్’ కారణంగా జూనియర్ ఎన్టీఆర్ దాదాపు మూడేళ్లపాటు మరో సినిమా లేకుండా ఉండిపోవాల్సి వచ్చింది. ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి కావడంతోపాటు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఈమేరకు చిత్రబృందం ‘ఆర్ఆర్ఆర్’ కోసం భారీగా ప్రమోషన్స్ చేపట్టింది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమా రిలీజ్ డేట్ మరోసారి వాయిదా పడాల్సి రావడం అభిమానులకు నిరాశను కలిగించింది.

Koratala Siva NTR30

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఓ మూవీ చేస్తాడనే వార్తలు విన్పించాయి. ‘ఆర్ఆర్ఆర్’తో యంగ్ టైగర్, పవన్ ‘బీమ్లానాయక్’తో త్రివిక్రమ్ బీజీగా మారడంతో మరో దర్శకుడు లైన్లోకి వచ్చాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో డైరెక్టర్ కొరటాల శివ ‘ఆచార్య’ తెరకెక్కించాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజుకు రెడీ ఉంది.

ఫిబ్రవరి 4న ‘ఆచార్య’ విడుదల అవుతుందని అంతా భావించారు. అయితే ‘రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ బాటలోనే ‘ఆచార్య’ కూడా పోస్ట్ పోన్ అయింది. ఏప్రిల్ 1న ఈ సినిమా రిలీజు కానుందని ఈరోజు చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈక్రమంలోనే దర్శకుడు కొరటాల శివతో ‘ఎన్టీఆర్ 30’ మూవీ పట్టాలెక్కేందుకు లైన్ క్లియర్ అయింది.

ఎన్టీఆర్ 30 మూవీని 2022 ఫిబ్రవరి 18న లాంఛ్ చేయాలని దర్శకుడు కొరటాల శివ భావిస్తున్నాడట. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు ఉండగా మెయిన్ హీరోయిన్ గా అలియాభట్, కియారా అడ్వాణీ పేర్లు ప్రముఖంగా విన్పించాయి. ప్రస్తుతానికి అలియా భట్ పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. రెమ్యూనేషన్ ను ను ఆమె బాగా డిమాండ్ చేస్తుండటంతో నిర్మాతలు ఆమె చర్చలు జరుపుతున్నారని టాక్.

ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ను తీసుకోవాలనే డిమాండ్ విన్పిస్తోంది. కొరటాల శివ ‘ఆచార్య’ కోసం మణిశర్మను తీసుకోవాల్సి వచ్చింది. అంతకు ముందు వరకు కొరటాల దేవీశ్రీ ప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ ఎంచుకునేవాడే. ఈ మూవీకి అనిరుధ్ పేరు విన్పిస్తుండటంతో ఈ మూవీ ఛాన్స్ కూడా దేవీశ్రీ ప్రసాద్ చేజారినట్లే కన్పిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్లోనే తెరకెక్కిందుకు దర్శక, నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

1 COMMENT

  1. […] Chandrababu: శకునం చెప్పే బల్లే కుడిదిలో పడిందట. అపర చాణక్యుడిగా పేరుపొందిన రాజకీయ నేత చంద్రబాబు నాయుడు వ్యూహాలు పనిచేయడం లేదు. ఫలితంగా ఆయన అనుకున్నది సాధించలేకపోతున్నారు. అధికారానికి దూరమవుతున్నారు. ప్రతిపక్ష నేతగానే మిగిలిపోతున్నారు. అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అన్నట్లుగా ఆయన తీరుతోనే అపార్థాలు వస్తున్నాయి. నేతల్లో అసహనం పెరిగిపోతోంది ఏకపక్ష నిర్ణయాలు నేతలను పార్టీకి దూరం చేస్తున్నాయి. ఫలితంగా అధికారం ఆమడదూరంలోనే మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దిద్దుబాటు చర్యలు చేపట్టినా అవి ఏ మేరకు ఫలితాలు ఇస్తాయో తెలియడం లేదు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular