Homeట్రెండింగ్ న్యూస్Bride Died: పెళ్లిపీటలపైనే తనువు చాలించిన వధువు.. మృతికి షాకింగ్ కారణం!

Bride Died: పెళ్లిపీటలపైనే తనువు చాలించిన వధువు.. మృతికి షాకింగ్ కారణం!

Bride Died: వాన రాకడ ప్రాణం పోకడ తెలియదంటారు. మనిషి ఎంత ప్రయత్నించినా చావు పుట్టుకల గురించి మాత్రం తెలుసుకోవడం లేదు. అవి ఎప్పుడు సంభవిస్తాయో ఎవరికి తెలియదు. వాటి గురించి ఎన్ని పరిశోధనలు చేసినా రహస్యం మాత్రం తేలడం లేదు. దీంతో మనిషి తన మనుగడ కొనసాగించే క్రమంలో వీటిని కనుగొనడం సాధ్యం కావడం లేదు. అందుకే ఎప్పుడు ప్రాణం పోతుందో చెప్పడం కుదరడం లేదు. చావు బతుకుల గురించి ఆలోచిస్తే మనకు నిజంగానే ఆశ్చర్యం వేస్తోంది.

Bride Died
Bride Died

విశాఖపట్నంలోని మదురవాడలో తెలుగు యువత అధ్యక్షుడు శివాజీకి సృజన అనే యువతితో బుధవారం రాత్రి వివాహం జరిపించేందుకు ముహూర్తం నిర్ణయించారు. అనుకున్న సమయం ప్రకారం వధూవరులిద్దరు వేదిక పైకి చేరుకున్నారు. పురోహితుడు వేదమంత్రాలు చదువుతున్నాడు. పెళ్లి జరిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతలో వధువు కళ్లు తిరిగి పడిపోయింది.

Also Read: Meenakshi Chaudhary: ఫోజులతో మతిపోగొడుతుంది,   కిర్రాక్ అందంతో మంట పెడుతుంది !        

దీంతో అందరు షాక్ కు గురయ్యారు. వివాహానికి ముందే వధువు సృహ తప్పడంతో అందరు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి వెళ్లే లోపే ఆమె తన తనువు చాలించింది. ఎందుకు చనిపోయిందన్నది ఎవరికీ అంతుబట్టలేదు. తాజాగా పోస్ట్ మార్టం చేయడంతో  వధువు మరణానికి విషపదార్థం కారణమని వైద్యులు నిర్ధారించారు. పెళ్లింట మంగళవాయిద్యాలు వాయించాల్సిన సమయంలో చావుడప్పు వినిపించడం నిజంగా విధి విచిత్రమే.

అయితే అమ్మాయికి నెలసరి వివాహం నాడే ఉండడంతో దాన్ని తప్పించేందుకు ట్యాబ్లెట్ ఇచ్చారని.. ఆ తర్వాతే ఆమె నీరసించిపోయి ఇలా అవ్వడానికి కారణం కావచ్చని వధువు  బంధువులు చెబుతున్నారు. మరి ఆ టాబ్లెట్ వికటించి విషంగా మారిందా? లేక పెళ్లి ఇష్టం లేక వధువు ఏమైనా తీసుకుందా? అన్నది తేలాల్సి ఉంది.

Bride Died
Bride Died

విధి ఆడిన వింత నాటకానికి ఫ్రీ వెడ్డింగ్ మాల్ వేదికైంది. జీవితంలో పెళ్లి చేసుకుని హాయిగా సంసారం చేస్తుందని ఆశించిన ఆడపిల్ల అసువులు బాయడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. తమ బిడ్డ ఎంతో చక్కగా సంసారం చేస్తుందని ఆశించినా నూరేళ్ల జీవితం బుగ్గిపాలు కావడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదైనా కాలమే శాపమా? ఆమె జీవితానికి అర్థంతరంగా ఇలా ముగింపా అని పెళ్లికొచ్చిన బందువులు సైతం కన్నీరుమున్నీరుగా విలపించారు.

Also Read:Mahesh Babu Daughter Sitara: మహేష్ కూతురు ‘సితార’ డ్రీమ్ మాములుగా లేదుగా.. ఇది షాకింగే

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version