Bride Attack On Groom: చిన్నప్పుడు తెలుగులో ఓ పాఠం ఉండేది కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు అని అలాగే మనకు ఎదురయ్యే వారందరిని తేరగా నమ్మరాదు వారిని పరిశీలించిన తరువాతే వారిని విశ్వసించాలి అంతే కానీ ఏదో మంచి మాటలు చెబుతున్నారని వారికి ఉన్నదంతా విప్పేయకూడదు. సొంత విషయాలు చెప్పకూడదు. అవసరమైనంత వరకే దగ్గరకు రానివ్వాలి అంతే కానీ మన గుట్టు అంత చెబితే వారు మనకు కీడు చేసే అవకాశమే ఉంటుంది ఇక్కడ కూడా అదే ప్రమాదం ఎదురైంది. పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ జంటలోని భాగస్వామి చేసిన ఘాతుకానికి అందరు ఆశ్చర్యపోయారు వివాహం చేసుకుంటుందని అనుకుంటే ఏకంగా కాటికే పంపాలని ప్రయత్నించింది చివరకు కటకటాల పాలైంది

ఆంద్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఇటీవల ఓ జంటకు పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 4న నిశ్చితార్తం నిర్వహించారు. వచ్చే నెల 20న వివాహం జరిపించాలని నిశ్చయించారు. పెళ్లి పనులు జరుగుతున్నాయి. సమయం కూడా దగ్గర పడుతోంది. కానీ వధువుకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దీంతో వివాహం వద్దని చెప్పే ధైర్యం లేదు. ఇంట్లో వారిని ఎదిరించే సత్తా లేదు. దీంతో తానే వరుడిని హత్య చేయాలని పథకం రచించింది. ఇందులో ఎక్కడ కూడా అతడికి అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. ఇక తన ప్లాన్ అమలు చేయడం ప్రారంభించింది. దీనికి వరుడిని తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది.
Also Read: CM Jagan: రాజ్యసభ సభ్యులుగా ఎవరికి అవకాశం ఇస్తారో
వరుడు రాము నాయుడు తనకు కాబోయే వధువు పుష్ప పిలుస్తుందని ఇంట్లో చెప్పి వచ్చాడు. వధువు ఇంట్లో భోజనం చేశాడు. దీంతో మనం బయటకు పోదామని చెప్పింది. ఇక కాబోయే భార్య పిలిస్తే పోక ఏం చేస్తారు. రామునాయుడు కూడా పుష్ప వెంట బయటకు వెళ్లాడు. తన ద్విచక్ర వాహనంపై ఆమెను ఎక్కించుకుని ప్రయాణిస్తున్నాడు. ఇంతలో ఓ చోట ఆపమని అడిగింది ఆ దుకాణంలో ఓ కత్తి కొనుగోలు చేసింది. దాన్ని అందమైన గిప్ట్ గా ప్యాక్ చేయించింది ఇక పదమని ఓ కొండ పైకి తీసుకెళ్లింది అక్కడ తన ప్రణాళిక అమలు చేయడం ప్రారంభించింది

ఇక్కడ కూడా తనకు అనుమానం రాకుండానే నడుచుకుంది స్నేహితులు వస్తారని చెప్పావు ఏరి అంటే లేటుగా వస్తారని తప్పించుకుంది. దీంతో అతడి ముఖానికి చున్నీ కప్పి తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడవబోయింది. తేరుకున్న వరుడు అడ్డుకోవడతో గండం గట్టెక్కింది. చివరకు పుష్ప కటకటాలపాలైంది, పెళ్లి వద్దంటే పోయేదాన్ని పట్టుకుని ఇంత క్రూరంగా ప్రవర్తించడం దేనికి? ఇంత దారుణమా అని నివ్వెరపోతున్నారు. అమ్మాయికి ఇంతటి దుర్మార్గమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఓ పెళ్లి కథ విషాదాంతంతో ముగియడం దారుణమే.
Also Read:AP high Court: మరోసారి జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు.. ఆన్ లైన్ టికెట్ల విషయంలో..