Prabhas Engagement: ప్రభాస్ పెళ్లి ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. ఈ 43 ఏళ్ల హీరో పెళ్లి పీటలు ఎక్కాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. పాన్ ఇండియా స్టార్ వివాహం చేసుకొని వారసుడిని ఇవ్వాలని, అతడు కృష్ణంరాజు,ప్రభాస్ నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశపడుతున్నారు. ఈ క్రమంలో ఏడాదికో ప్రచారం, నెల కోసం పుకారు తెరపైకి వస్తూ ఉంటాయి. ప్రభాస్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వచ్చింది లేదు. అన్ స్టాపబుల్ వేదికగా బాలయ్య సైతం ప్రభాస్ మనసులో మాట బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడిగితే సిల్లీ సమాధానాలు చెప్పి మాటలు దాటవేశాడే కానీ నిజం బయటపెట్టలేదు.

ఈ క్రమంలో ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు సంచలన ట్వీట్ చేశారు. బ్రేకింగ్ వచ్చేవారం ప్రభాస్-కృతి సనన్ ల ఎంగేజ్మెంట్ మాల్దీవ్స్ లో ఘనంగా జరుగనుంది.. అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇటీవల ప్రభాస్-కృతి మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ పుకార్లు వినిపించిన నేపథ్యంలో ఉమర్ సంధు ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమర్ సంధు ట్వీట్ పై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్రభాస్ అభిమానులు మాత్రం నిరాధార కథనాలు ప్రచారం చేయకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బేడియా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కరణ్ జోహార్, వరుణ్ ధావన్, కృతి సనన్ ఓ షోలో పాల్గొన్నారు. ఆ షోలో కృతి సనన్ ఒకరి మనసులో ఉంది. ఆయన ముంబైలో లేరు. వేరే చోట దీపికా పదుకొనెతో పాటు షూటింగ్ చేస్తున్నారంటూ వరుణ్ ధావన్ కామెంట్ చేశారు. వరుణ్ ఇచ్చిన హింట్స్ ప్రకారం అది ప్రభాస్. దీపికా పదుకొనెతో ప్రాజెక్ట్ కే షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీంతో కృతి-ప్రభాస్ ఎఫైర్ రూమర్స్ పెద్ద ఎత్తున ప్రచారమయ్యాయి. అయితే ఈ వార్తలను కృతి ఖండించారు. ప్రభాస్ నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. మా మధ్య ఏం లేదన్నారు.

ప్రభాస్-కృతి సనన్ ఎఫైర్ రూమర్స్ సద్దుమణిగాయి. ఉమర్ సంధు ట్వీట్ తో మరోసారి ఈ న్యూస్ దావానంలా వ్యాపించింది. నిజంగా కృతి-ప్రభాస్ ఎంగేజ్మెంట్ జరుపుకోబోతున్నారా? లేదా? అనేది వారం రోజుల్లో తెలుస్తుంది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా ఉమర్ సంధు బాగా ఫేమస్ అయ్యారు. ఆయన స్టార్ హీరో చిత్రాలకు ఇచ్చే రేటింగ్స్ వివాదాస్పదం అవుతూ ఉంటాయి. ఇకపోతే ప్రభాస్, కృతి జంటగా నటించిన ఆదిపురుష్ జూన్ 16న విడుదల కానుంది. దర్శకుడు ఓం రౌత్ రామాయణ గాథగా ఆదిపురుష్ తెరకెక్కించారు. ప్రస్తుతం ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.
BREAKING NEWS: #KritiSanon & #Prabhas will get engaged next week in Maldives 🇲🇻!! So Happy for them.
— Umair Sandhu (@UmairSandu) February 5, 2023