
Photo Story: చిన్నతనం లో బాలనటులుగా వచ్చిన ఎంతో మంది నేడు స్టార్ హీరోలు గా,హీరోయిన్స్ గా కొనసాగుతూ చిత్ర పరిశ్రమని ఏలుతున్నారు..కానీ ఈరోజు మనం బాలనటుల గురించి కాదు, క్రింద కనిపిస్తున్న ఫొటోలో చిరంజీవి మరియు బాలకృష్ణ మధ్య నిల్చున్న ఆ చిన్నారి గురించి మాట్లాడుకోబోతున్నాము.చాలా రోజుల నుండి సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ ఫొటోలో ఉన్న ఆ అమ్మాయి ఎవరు అని తెలుసుకునేందుకు నెటిజెన్స్ ప్రయత్నిస్తూనే ఉన్నారు,కానీ సరైన సమాచారం మాత్రం లేదు.
అయితే కాస్త సుదీర్ఘంగా పరిశీలించిన తర్వాత తెలిసింది ఏమిటంటే ఆ అమ్మాయి మరెవరో కాదు ప్రముఖ దిగ్గజ నిర్మాత అశ్వినీ దత్ కూతురు ప్రియాంక దత్ అని తెలుస్తుంది.తండ్రి నిర్మాత అయ్యినంత మాత్రాన తాను కూడా నిర్మాత అవ్వాల్సిన అవసరం లేదు, హీరోయిన్ కూడా అవ్వొచ్చు, కానీ తనకి ఎంతో ఆసక్తి ఉన్న నిర్మాణ రంగం లోకే అడుగుపెట్టింది.
ఈమె సినిమాలు నిర్మించడం లో సరికొత్త అభిరుచి కలిగిన వ్యక్తి, 3 ఏంజిల్స్ స్టూడియో పేరు తో ఒక నిర్మాణ సంస్థ ని ప్రారంభించి బాణం , ఎవడే సుబ్రహ్మణ్యం మరియు మహానటి వంటి సంచలనాత్మక చిత్రాలను నిర్మించింది.గత ఏడాది విడుదలైన సీతారామం సినిమా కి కూడా ఈమె సహా నిర్మాతగా వ్యవహరించింది, ఈ చిత్రం ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ తో ప్రాజెక్ట్ K వంటి భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమాకి ఒక నిర్మాతగా వ్యవహరించే అద్భుతమైన ఛాన్స్ ని కొట్టేసింది..ఈ సినిమా మీద ప్రస్తుతం అభిమానుల్లో ఏరేంజ్ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈ చిత్రం అనుకున్న విధంగా భారీ హిట్ అయితే నిర్మాతగా ప్రియాంక దత్ తండ్రిని మించిన తనయురాలిగా ఎదుగుతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.