Konaseema: చిరంజీవి… అంటే మరణం లేనివాడు.. అమరుడు అని అర్థం. అయితే మనవ జీవితంలో ఇలాంటి అవకాశం కొందరికే వస్తుంది. మరణించి కూడా జీవించే వారు కొందరు ఉంటారు. అలా ఎలా అంటే.. మరణించిన తర్వాత కూడా తమ అవయవాలను దానం చేసి.. మరొకరికి జీవితం ఇస్తున్నారు. అవయవదానం అంటే ఇతరులకు ప్రాణదానం చేయడమే. అవయవదానంతో ప్రాణాపాయస్థితిలో ఉన్న ఎంతోమందిని కాపాడవచ్చు. ఆర్గాన్ డొనేషన్‌తో మరణించి చిరంజీవులు అవుతున్నారు. ఈ తరహాలోనే మరికొందరి జీవితాలకు వెలుగులు నింపే మహనీయులు.. ఇదే ప్రేరణగా తీసుకొని కాకినాడ జిల్లాలో శ్రీరాములు కుటుంబసభ్యులు గొప్ప మనస్సును చాటుకున్నారు.
ఏం జరిగిందంటే..
గత నెల 26న ముమ్మిడివరం బొండాయికోడు పెట్రోల్ బంక్ దగ్గర ప్యాసింజర్ ఆటో రాంగ్ రూట్లో వచ్చి బైక్‌పై వెళుతున్న రాంబాబును ఢీకొట్టింది. దీంతో రాంబాబు కోమాలోకి వెళ్లాడు. మెరుగైన వైద్యం కోసం అమలాపురం కిమ్స్ హాస్పిటల్‌కి తరలించారు. వైద్యులు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. దీంతో తీవ్ర విషాదంలోను ఆయన కుటుంబ సభ్యులు మరణంతో పోరాడి ఓడిన తమ కుటుంబ సభ్యుని అవయవాలు దానం చేసి రెండు ప్రాణాలను కాపాడారు.
కోనసీమ జిల్లాలో ఘటన..
కోనసీమ జిల్లాలోని కాట్రేకోన మండలం చెయ్యేరు జల్లగుంట గ్రామానికి చెందిన గవర శ్రీరాములు అలియాస్ రాంబాబును సెప్టెంబర్ 26న ముమ్మిడివరం బొండాయికోడు పెట్రోల్ బంక్ దగ్గర ప్యాసింజర్ ఆటో రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టింది. దీంతో రాంబాబు కోమాలోకి వెళ్లాడు. మెరుగైన వైద్యం కోసం అమలాపురం కిమ్స్ హాస్పిటల్‌కి తరలించారు. వైద్యులు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు.
దుఃఖంలోనూ గొప్ప మనసు చాటుకుని..
దీంతో తీవ్ర విషాదంలోను ఆయన కుటుంబ సభ్యులు గొప్పమనస్సు చాటుకున్నారు. అవయధానానికి ముందుకు వచ్చారు. ట్రస్ట్ హాస్పిటల్లో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసి.. కిడ్నీలను తీశారు. ఒకటి ట్రస్ట్ హాస్పిటల్ రోగికి అమర్చారు. మరో కిడ్నీ విశాఖపట్నం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి అమర్చేందుకు కాకినాడ నుంచి తరలించారు.