Khadgam: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన ఖడ్గం సినిమా అప్పట్లో సంచలనాలు క్రియేట్ చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పటి వరకు అలాంటి సినిమా రాలేదు అనెంత గొప్పగా డైరెక్టర్ ఈ సినిమాని తీర్చిదిద్దడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా కూడా చాలా మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమాలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్,రవితేజ ముగ్గురి యాక్టింగ్ కూడా ఈ సినిమా హిట్ అవ్వడానికి చాలా హెల్ప్ అయిందనే చెప్పాలి.
ముఖ్యంగా శ్రీకాంత్ అయితే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఈ సినిమా దేశభక్తి నేపథ్యం లో సాగుతూ ఉండటం వల్ల ప్రతి సీన్ లో కూడా కృష్ణవంశీ తనదైన ఎఫర్ట్ పెట్టి చాలా అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కృష్ణవంశీకి చాలామంది నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వచ్చినట్టుగా ఆయన చెప్పడం జరిగింది.ఇక శ్రీకాంత్ అయితే బయట ఎక్కడైనా కనిపిస్తే కొంతమంది దాడి చేయడానికి రెడీగా ఉండి కొన్నిసార్లు దాడికి చేయడానికి కూడా ట్రై చేసినట్టుగా ఆయన చెప్పడం జరిగింది.
శ్రీకాంత్ రిలాక్సేషన్ కోసం క్రికెట్ ఆడటానికి గ్రౌండ్ కి వెళ్లినప్పుడు కూడా తన జేబు లో గన్ పెట్టుకుని వెళ్లేవాడు. అలా కొద్ది రోజులపాటు శ్రీకాంత్ కూడా కొంతమందికి భయపడుతూ ఉండాల్సి వచ్చింది. అయితే ఈ సినిమా హిందూ, ముస్లింల మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉండాలి అనే పాయింట్ తో తీయడం జరిగింది.ఇక దాన్ని ఉద్దేశించే ఈ సినిమాకి చాలా అవార్డులు కూడా వచ్చాయి. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు భారత దేశ పౌరులే ఏ కులానికి, ఏ మతానికి చెందిన వారైనా అంత భారతీయులే అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రావడంతో అప్పట్లో ఇది ఒక మంచి హిట్ గా నిలిచింది.
ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తన యాక్టింగ్ తో ప్రేక్షకులు చేత శభాష్ అనిపించుకున్నాడు. రవితేజ కూడా ఒక్క ఛాన్స్ అంటూ డైలాగ్ చెబుతు ఆ డైలాగ్ తో విపరీతంగా పాపులర్ అయ్యాడు. ఇక శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే సినిమా మొత్తం సీరియస్ గా ఉండి క్లైమాక్స్ లో మాత్రం చాలా వైలెంట్ గా రియాక్ట్ అవుతూ ఉంటాడు. దాంతో ఈ సినిమా సూపర్ హిట్ అయింది కానీ కృష్ణ వంశీ,శ్రీకాంత్ లు మాత్రం కొద్దిరోజులపాటు చాలా సెక్యూరిగా తిరగాల్సి వచ్చింది…