Home ఎంటర్టైన్మెంట్ Kamaal Rashid khan: రష్మికా… నీ లవర్ ని తరిమేశాం నెక్స్ట్ నువ్వే…బాలీవుడ్ యాక్టర్ షాకింగ్ వార్నింగ్!

0
Kamaal Rashid khan: రష్మికా… నీ లవర్ ని తరిమేశాం నెక్స్ట్ నువ్వే…బాలీవుడ్ యాక్టర్ షాకింగ్ వార్నింగ్!

Kamaal Rashid khan: సోషల్ మీడియా ఎంత మంచి చేస్తుందో అంత చెడు కూడా చేస్తుంది. ముఖ్యంగా ద్వేషం ఎక్కువైపోయింది. సెలెబ్రిటీలు హేట్ కి గురవుతున్నారు. లక్షమంది అభిమానుల పాజిటివ్ కామెంట్స్ కంటే వెయ్యి మంది హేటర్స్ ట్రోల్స్ హైలెట్ అవుతున్నాయి. ఈ విద్వేషపూరిత మాటలు మానసికంగా దెబ్బతీస్తున్నాయి. గ్లామర్ ఫీల్డ్ లో ఉండేవారికి సోషల్ మీడియా చాలా అవసరం. వారి కెరీర్ కి సంబంధించిన విషయం. అయినప్పటికీ కొందరు సెలెబ్స్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ట్రోల్స్, మీమ్స్, హేట్ కామెంట్స్ కి భయపడి సోషల్ మాధ్యమాలను వాడటం ఆపేస్తునారు.

Kamaal Rashid khan
Kamaal Rashid khan

ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మకు మించి ఒక నటుడు, నిర్మాత బాలీవుడ్లో ఉన్నాడు. అతడు ఫిల్మ్ క్రిటిక్ కూడాను. సినిమా న్యూస్ ఫాలో అయ్యే వాళ్లకు ఆయన దాదాపు సుపరిచితుడే. సల్మాన్ నుండి అలియా వరకూ బాలీవుడ్ పెద్దలను ఎవరినీ వదలడు. అందరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ఓ కొత్త సినిమా విడుదల కాకుండానే అది ఫ్లాప్ అవుతుందని జోస్యం చెబుతాడు. ఆయన పేరు కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కే ఆర్ కే. ట్విట్టర్ లో ఆయన విద్వేష పూరిత కామెంట్స్ ఎక్కువైపోవడంతో ఒకసారి అకౌంట్ సస్పెండ్ చేశారు. తర్వాత మరో అకౌంట్ స్టార్ట్ చేశాడు.

కమల్ ఆర్ ఖాన్ కి సౌత్ చిత్రాలన్నా పడదు. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. బాహుబలి చిత్రాలనే కార్టూన్ మూవీస్ అంటూ ఎద్దేవా చేశాడు. తాజాగా కమల్ ఆర్ ఖాన్ హీరోయిన్ రష్మిక మందానను టార్గెట్ చేశాడు. ఆమెపై అనుచిత కామెంట్స్ చేశారు. రష్మిక గ్లామర్, ఇమేజ్ ని కించపరుస్తూ దారుణమైన ట్వీట్స్ చేశాడు. విజయ్ దేవరకొండను కూడా పరోక్షంగా అనరాని మాటలు అన్నాడు. కమల్ ఆర్ ఖాన్ తన ట్వీట్లో ”రష్మిక లైగర్ ప్లాప్ చేసి నీ లవర్ అనకొండను బాలీవుడ్ నుండి తరిమేశాము. తనలాగే నిన్ను కూడా పంపిస్తాము. లేదూ నార్త్ లోనే ఉండాలి అనుకుంటే… భోజ్ పురి సినిమాలు చేసుకో, మాకు అభ్యంతరం లేదు” అని ట్వీట్ చేశాడు.

Kamaal Rashid khan
Kamaal Rashid khan

మరొక ట్వీట్లో ”రష్మిక నేషనల్ క్రష్ అని నమ్ముతున్న వారు తమ కళ్ళను ఒకసారి టెస్ట్ చేయించుకుంటే బెటర్. రవి కిషన్, పవన్ సింగ్ వంటి నటులతో చేసే రేంజ్ ఆమెది” అని కామెంట్ చేశాడు. విజయ్ దేవరకొండను తరిమేశామని, నెక్స్ట్ నువ్వే అంటూ కమల్ ఆర్ ఖాన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు. రష్మిక అందాన్ని, ఆమె ఇమేజ్ ని కించపరుస్తూ అనుచిత కామెంట్స్ చేశాడు. కమల్ ఆర్ ఖాన్ ని విజయ్ దేవరకొండ, రష్మిక ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. రష్మిక బాలీవుడ్ లో మిషన్ మజ్ను, యానిమల్ చిత్రాల్లో నటిస్తున్నారు.