Anant Ambani Wedding: “ఆకాశమంత పందిరి.. భూదేవంత మండపం..” పెళ్లి వేడుక ఘనంగా జరిగితే పై జాతీయం తోనే అన్వయిస్తాం. ఇలాంటి పెళ్లి వేడుక త్వరలో అంబానీ ఇంట్లో జరగనుంది. అసలే కుబేరుడు.. పైగా ఆయన ఇంట్లో ఈతరానికి సంబంధించి జరుగుతున్న చివరి పెళ్లి. దీంతో ఆ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అంబానీ ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇప్పటికే తన పెద్ద కొడుకు ఆకాష్, ఈషా వివాహాలు పూర్తిచేసిన అంబానీ.. తన చిన్న కొడుకు అనంత్ వివాహ వేడుకను అంతకంటే ఘనంగా చేయాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నారు.
2022లో అనంత్, రాధిక కు నిశ్చితార్థ వేడుక జరిగింది. తర్వాత గత ఏడాది ముంబైలోని అంబానీ అధికారిక నివాసం యాంటీయాలో ఇతర వేడుకలు జరిపారు. ఇటీవల ఫిబ్రవరి 16న జామ్ నగర్ లో లగన్ లఖ్వా వేడుకలు జరిపారు.. వివాహ వేడుకను జూలై 12న ముంబైలో నిర్వహిస్తారు. ఒకటి నుంచి మూడు వరకు జామ్ నగర్ లోని అంబానీ ఎస్టేట్లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుపుతారు. ప్రస్తుత ఏర్పాట్లు చూస్తుంటే భారతదేశం లోనే అత్యంత ఖరీదైన పెళ్లిలలో అనంత్, రాధికా మర్చంట్ వివాహ వేడుక నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ వివాహ వేడుకకు మన దేశంలోని అతిపెద్ద సెలబ్రిటీలు మాత్రమే కాకుండా అంతర్జాతీయ సెలబ్రిటీలు, ధనవంతులు, పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మెలిండా గేట్స్, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్, ఇవాంకా ట్రంప్, బ్లాక్ రాక్ సీఈవో లారీ ఫింక్, బ్లాక్ స్టోన్ చైర్మన్ స్టీఫెన్ స్కావ్ ర్జ్ మన్, డిస్నీ సీఈవో బాబ్ ఈగర్, మోర్గాన్ స్టాన్లీ సీఈవో టెడ్ పిక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా చైర్మన్ బ్రియాన్ థామస్, అడ్నాక్ సీఈవో సుల్తాన్, భూటాన్ రాజు, రాణి, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, టెక్ ఇన్వెస్టర్ యూరి మిల్నర్ వంటి వారు అంబానీ ఇంట జరిగే పెళ్ళి వేడుక కు హాజరుకానున్నారు. సుమారు 1000 మందికి పైగా ఫ్రీ వెడ్డింగ్ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు.