India Vs England: ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా రాంచీ మైదానం వేదికగా శుక్రవారం నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు రెండు మ్యాచ్లు పడింది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని భావిస్తుంది. ఈ క్రమంలో జట్టులో కొన్ని మార్పులు చేసింది. మార్క్ ఉడ్ స్థానంలో రాబిన్ సన్, అహ్మద్ స్థానంలో యకు బషీర్ కు స్థానం కల్పించింది.. గత మూడు మ్యాచ్ల్లో విఫలమైన జో రూట్ ను మాత్రం అలాగే కొనసాగించింది. బజ్ బాల్ విధానంలో ఇప్పటివరకు ఒక టెస్ట్ సిరీస్ కూడా కోల్పోని ఇంగ్లాండ్ జట్టు.. ఈ మ్యాచ్ ఓడిపోతే ఆ విధానాన్ని పున: సమీక్షించే అవకాశం ఉంది.
టాస్ ఓడిన భారత జట్టు బౌలింగ్ దళానికి సిరాజ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో అతడి స్థానంలో ఆకాశ్ దీప్ సింగ్ కు అవకాశం కల్పించారు. ఇటీవల జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో భారత జట్టు ఈ స్థాయిలో బలహీనమైన పేస్ దళంతో బరిలోకి దిగడం ఇదే ప్రథమం. ఐపీఎల్ లో బెంగళూరు జట్టులో ఆడుతున్న ఈ యువ బౌలర్ ఇప్పటివరకు 7 మ్యాచ్ లు ఆడి ఆరు వికెట్లు తీశాడు.
ఇక తొలి అరంగేట్ర మ్యాచ్లో ఆకాష్ చెలరేగాడు. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డక్కెట్ ను ఔట్ చేసి సత్తా చాటాడు.. ఆకాష్ వేసిన బంతిని తప్పుగా అర్థం చేసుకున్న డకెట్ అనవసరంగా షాట్ ఆడబోయి ధృవ్ చేతికి చిక్కాడు. దీంతో 9.2 ఓవర్ల వద్ద 47 పరుగులకు ఇంగ్లాండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం ఓలి పోప్ వన్ డౌన్ బ్యాటర్ గా క్రీజ్ లోకి వచ్చాడు. ఆకాష్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇక ఓపెనర్ జాక్ క్రాలేను క్లీన్ బౌల్డ్ చేసిన ఆకాష్ దీప్ మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ నడ్డి విడిచాడు. దీంతో తన తొలి ఆరంగేట్ర మ్యాచ్లోనే మూడు వికెట్లు తీసి ఆకాష్ సత్తా చూపించాడు. ఇంగ్లాండ్ జట్టు మూడు బంతుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో ఇబ్బందుల్లో పడింది. మరో ఓపెనర్ క్రావ్ లే 36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 35 పరుగులు చేశాడు. ప్రస్తుతం జో రూట్, క్రావ్ లే క్రీజ్ లో ఉన్నారు. 10.2 ఓవర్లలో భారత్ రెండు వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది.