https://oktelugu.com/

Bigg Boss 5: బిగ్ బాస్ లో షాకిచ్చిన నాగార్జున.. హౌస్ నుంచి గెట్ ఔట్

Bigg Boss 5: బిగ్ బాస్ లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. హానీమూన్ లా సాగుతున్న హౌస్ ను ఈ శనివారం ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఒక ఊపు ఊపాడు. కుదిపేశాడు. కంటెస్టెంట్ల అందరి అభిప్రాయం తీసుకొని అందరిలోకి ఎవరూ బిగ్ బాస్ హౌస్ లో ఉండకూడదో తెలుసుకున్నాడు. వారిలో నాలుగు ఓట్లు ప్రియకు, మరో నాలుగు ఓట్లు లోబోకు వచ్చాయి. దీంతో వీరిద్దరిలో ఒకరిని ఇంటి నుంచి డైరెక్టుగా నాగార్జున ఎలిమినేట్ చేసేయడం సంచలనమైంది. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 16, 2021 / 07:50 PM IST
    Follow us on

    Bigg Boss 5: బిగ్ బాస్ లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. హానీమూన్ లా సాగుతున్న హౌస్ ను ఈ శనివారం ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఒక ఊపు ఊపాడు. కుదిపేశాడు. కంటెస్టెంట్ల అందరి అభిప్రాయం తీసుకొని అందరిలోకి ఎవరూ బిగ్ బాస్ హౌస్ లో ఉండకూడదో తెలుసుకున్నాడు. వారిలో నాలుగు ఓట్లు ప్రియకు, మరో నాలుగు ఓట్లు లోబోకు వచ్చాయి. దీంతో వీరిద్దరిలో ఒకరిని ఇంటి నుంచి డైరెక్టుగా నాగార్జున ఎలిమినేట్ చేసేయడం సంచలనమైంది. ఈ మేరకు విడుదలైన ప్రోమో హాట్ టాపిక్ గా మారింది.

    బిగ్ బాస్ సీజన్ 5లో శనివారం నాగార్జున కంటెస్టెంట్లకు గట్టి షాక్ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ ను వ్యక్తిగతంగా సీక్రెట్ రూంలోకి పంపించిన నాగార్జున ‘హౌస్ లో ఉండడానికి అర్హత లేని వారి పేరు చెప్పండి’ అంటూ అడిగారు. దీంతో హౌస్ మేట్స్ షాక్ అయ్యారు. చాలా ఆలోచించి ఎలిమినేట్ కావాల్సిన ఒకరి పేరు చెప్పారు.

    అలా హౌస్ లో ఉండడానికి అర్హత లేని వారిలో ప్రియ, లోబోలు అత్యధిక ఓట్లతో సమానంగా నిలిచారు. వీరిలో ఒకరిని ఈ వారం ఇంటి నుంచి పంపించేందుకు నాగార్జున బిగ్ బాస్ ఇంటి తలుపులు తెరవడం సంచలనమైంది.

    సగం మంది లోబో పక్కన సగం మంది ప్రియ పక్కన నిలుచున్నారు. వీరిలో యానీ మాస్టర్ తేల్చుకోలేకపోయింది. ఆమె ఎవరి సైడ్ నిలబడకపోతే వారు ఎలిమినేట్ సో. ఈ వారం ప్రియ, లోబోల్లో ఒకరు ఓట్లతో సంబంధం లేకుండానే వెళ్లిపోతున్నారు.

    గతంలోనూ ఇలానే ఒకరిని ఎలిమినేట్ చేసేసి సీక్రెట్ రూంలో ఉంచి బిగ్ బాస్ గేమ్ ఆడాడు. కాగా లోబో భార్యకు నెలలు నిండాయని.. అతడిని బయటకు పంపేందుకు ఇలా నాగార్జున చేశాడన్న టాక్ నడుస్తోంది.

    వీడియో..