https://oktelugu.com/

Bigboss Himaja : కొత్తింట్లో అడుగుపెట్టిన బిగ్ బాస్ బ్యూటీ… అన్ని కోట్లు ఎక్కడివి బాబోయ్!

మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన హిమజ మొదట్లో సీరియల్స్ లో నటించారు. అనంతరం సిల్వర్ స్క్రీన్ కి ప్రమోట్ అయ్యారు. హీరోయిన్ ఫ్రెండ్ వంటి సపోర్టింగ్ రోల్స్ చేశారు. శివమ్ హిమజ మొదటి చిత్రం. నేను శైలజ, జనతా గ్యారేజ్, వినయ విధేయ రామ, శతమానం భవతి వంటి చిత్రాల్లో హిమజ నటించారు. ఆమెకు అడపాదడపా ఆఫర్స్ వస్తున్నాయి. 

Written By:
  • Shiva
  • , Updated On : June 11, 2023 / 01:45 PM IST
    Follow us on

    Bigboss Himaja : బిగ్ బాస్ హిమజ నూతన గృహప్రవేశం చేశారు. హైదరాబాద్ లో ఉన్నత వర్గాలు ఉండే ఏరియాలో హిమజ ఇల్లు నిర్మించుకున్నారు. గృహప్రవేశ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. కొత్త ఇల్లు కట్టుకోవడం అంటే కలలు సాకారం చేసుకోవడం. భవిష్యత్తులో ఎన్నో జ్ఞాపకాలు ఆ ఇంటితో ముడిపడి ఉంటాయి. సొంతింటి కల నెరవేర్చుకున్న నాకు నేను శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను… అని ఫోటో పోస్ట్ చేశారు. చేతిలో లక్ష్మీ దేవి ఫోటో పట్టుకున్న హిమజ ట్రెడిషనల్ వేర్లో కనిపించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 
     
    ఇక గృహప్రవేశం చేసిన హిమజకు మిత్రులు, సన్నిహితులు, పరిశ్రమ వర్గాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీ ఇల్లు చాలా బాగుందని కామెంట్ చేస్తున్నారు. హిమజ కొత్త ఇంటి నిర్మాణానికి కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ఆధునిక సౌకర్యాలతో సర్వహంగులతో ఇంటిని నిర్మించుకున్నారట. భూమి పూజ చేసినప్పటి నుండి హిమజ కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తుంది.  కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా కానీ హిమజ ఇంత ఖరీదైన ఇల్లు ఎలా నిర్మిస్తున్నారని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. వారిపై హిమజ మండిపడింది. తన సంపాదనకు సంబంధించిన విషయాలు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. 
     
    మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన హిమజ మొదట్లో సీరియల్స్ లో నటించారు. అనంతరం సిల్వర్ స్క్రీన్ కి ప్రమోట్ అయ్యారు. హీరోయిన్ ఫ్రెండ్ వంటి సపోర్టింగ్ రోల్స్ చేశారు. శివమ్ హిమజ మొదటి చిత్రం. నేను శైలజ, జనతా గ్యారేజ్, వినయ విధేయ రామ, శతమానం భవతి వంటి చిత్రాల్లో హిమజ నటించారు. ఆమెకు అడపాదడపా ఆఫర్స్ వస్తున్నాయి. 
     
    2019లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3లో హిమజ పాల్గొన్నారు. నాగార్జున హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆ సీజన్ సూపర్ హిట్. శ్రీముఖి, బాబా భాస్కర్, అషురెడ్డి, హేమ, పునర్నవి వంటి పేరున్న సెలెబ్రిటీలు ఈ సీజన్లో పాల్గొన్నారు. హిమజ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది. అయితే అంచనాలను అందుకోలేకపోయింది. హిమజ 9వ వారం ఎలిమినేట్ అయ్యింది. ఆ సీజన్ విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. శ్రీముఖిని ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు.