https://oktelugu.com/

Pushpa 2 Teaser- Divi Vadthya: పుష్ప2లో బిగ్ బాస్ బ్యూటీ.. టీజర్ లో హైలెట్ ఆమెనే… హీరోయిన్ అవుతుందనుకుంటే!

Pushpa 2 Teaser- Divi Vadthya: పుష్ప 2 టీజర్ బిగ్ సర్ప్రైజ్. ఊహించిన దానికి డబుల్ ఇంపాక్ట్ ఇచ్చారు. చెప్పాలంటే కథపై ఓ హింట్ ఇచ్చేశారు. పుష్ప మాఫియా డాన్ గా ఎదగడం. స్మగ్లర్ గా సంపాదించింది పేదలకు పంచడమే ఈ చిత్ర కథ. ప్రచారం అవుతున్నట్లు పుష్ప టీం ఎక్కడా తగ్గలేదు. చాలా రిచ్ గా మూవీ తెరకెక్కిస్తున్నారు. విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. పుష్ప 2 టీజర్లో అల్లు అర్జున్ మేనరిజం మరోసారి […]

Written By: , Updated On : April 7, 2023 / 05:20 PM IST
Follow us on

Pushpa 2 Teaser- Divi Vadthya

Pushpa 2 Teaser- Divi Vadthya

Pushpa 2 Teaser- Divi Vadthya: పుష్ప 2 టీజర్ బిగ్ సర్ప్రైజ్. ఊహించిన దానికి డబుల్ ఇంపాక్ట్ ఇచ్చారు. చెప్పాలంటే కథపై ఓ హింట్ ఇచ్చేశారు. పుష్ప మాఫియా డాన్ గా ఎదగడం. స్మగ్లర్ గా సంపాదించింది పేదలకు పంచడమే ఈ చిత్ర కథ. ప్రచారం అవుతున్నట్లు పుష్ప టీం ఎక్కడా తగ్గలేదు. చాలా రిచ్ గా మూవీ తెరకెక్కిస్తున్నారు. విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. పుష్ప 2 టీజర్లో అల్లు అర్జున్ మేనరిజం మరోసారి హైలెట్ అయ్యింది. సాధారణ జనాల చేత పుష్ప క్యారెక్టర్ ని హైలెట్ చేయించడం బాగుంది.

పుష్ప టీజర్లో జనాలను ఆకర్షించిన మరొక విషయం ఉంది. అది బిగ్ బాస్ దివి. ఈ యంగ్ బ్యూటీని టీవీ రిపోర్టర్ గా చూపించారు. ఆమె మీద తీసిన ఓ షాట్ అద్భుతం. నిరసనకారుడు విసిరిన రాయి నుండి టీవీలో ఉన్న దివి తప్పించుకున్నట్లు చూపిస్తారు. ఇదెలా సాధ్యం అనుకునే లోపు ఆమె ఆ పగిలిన టీవీ ముందు నిల్చుని లైవ్ ఇస్తూ ఉంటుంది. ఇది దర్శకుడు ఆలోచన, కెమెరా పనితనానికి నిదర్శనం.

Pushpa 2 Teaser- Divi Vadthya

Pushpa 2 Teaser- Divi Vadthya

దివి పుష్ప 2లో రిపోర్టర్ గా ఓ రోల్ చేశారన్న క్లారిటీ వచ్చింది. హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తున్న దివి ఇలాంటి పాత్రకు ఒప్పుకోవడం నిజంగా సాహసమే. అయితే ఆమె పాత్ర సినిమాలో మరింత కీలకం గా ఉండే అవకాశాలు కొట్టిపారేయలేం. కనిపించకుండా పోయిన పుష్పను వెతికే రిపోర్టర్ గా కూడా ఆమె పాత్ర ఉండొచ్చు. చెప్పుకోదగ్గ స్క్రీన్ స్పేస్ కలిగిన రోల్ కావడంతో ఒప్పుకుని ఉండొచ్చు. పుష్ప 2 వంటి భారీ చిత్రంలో ఛాన్స్ వస్తే ఎవరైనా వదులుకోరు. జనాలకు బాగా రీచ్ అయ్యే చిత్రం కాబట్టి పాపులారిటీ దక్కుతుందని భావిస్తారు.

తెలుగు అమ్మాయి అయిన దివి హీరోయిన్ గా ఒకటి రెండు చిత్రాలు చేస్తారు. అవి నామమాత్రపు సినిమాలు కావడంతో జనాలకు చేరలేదు. మహర్షి మూవీలో స్టూడెంట్ గా చిన్న పాత్ర చేశారు. బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న దివికి ఫేమ్ దక్కింది. ఇటీవల ఆమె గాడ్ ఫాదర్, జిన్నా చిత్రాల్లో నటించారు. మరోవైపు వెబ్ సిరీస్లలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు. పుష్ప 2 ఆమెకు బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

Where is Pushpa? | Pushpa 2 - The Rule 🔥 | Telugu | Allu Arjun | Sukumar | Rashmika | Fahadh Faasil