https://oktelugu.com/

Bigg Boss 6 Telugu : టైటిల్ విన్నర్ గా శ్రీహాన్.. రన్నర్ గా శ్రీ సత్య.. అప్పుడే బిగ్ బాస్ టాప్ 2 లిస్ట్ బయటకి వచ్చేసింది!

Bigg Boss 6 Telugu : ప్రారంభంలో బిగ్ బాస్ సీజన్-6 నత్తనడకన బోరింగ్ గా సాగినప్పటికీ గత కొద్దీ వారాల నుండి ఆసక్తికరమైన టాస్కులతో వాడావేడి వాతావరణంలో కొనసాగుతుంది.. టీఆర్ఫీ రేటింగ్స్ కూడా అదిరిపోతున్నాయి..అయితే హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి ఉన్న కంటెస్టెంట్స్ లో ఇద్దరి స్థానాలు మాత్రం స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి..ఆ ఇద్దరిలో ఒకరు రేవంత్ కాగా మరొకరు శ్రీహాన్.. కానీ ఈ వారం శ్రీహన్ గ్రాఫ్ రెండవ స్థానం నుండి మూడవ […]

Written By: , Updated On : November 10, 2022 / 07:58 PM IST
Follow us on

Bigg Boss 6 Telugu : ప్రారంభంలో బిగ్ బాస్ సీజన్-6 నత్తనడకన బోరింగ్ గా సాగినప్పటికీ గత కొద్దీ వారాల నుండి ఆసక్తికరమైన టాస్కులతో వాడావేడి వాతావరణంలో కొనసాగుతుంది.. టీఆర్ఫీ రేటింగ్స్ కూడా అదిరిపోతున్నాయి..అయితే హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి ఉన్న కంటెస్టెంట్స్ లో ఇద్దరి స్థానాలు మాత్రం స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి..ఆ ఇద్దరిలో ఒకరు రేవంత్ కాగా మరొకరు శ్రీహాన్.. కానీ ఈ వారం శ్రీహన్ గ్రాఫ్ రెండవ స్థానం నుండి మూడవ స్థానానికి పడిపోయింది..రెండో స్థానంలోకి ఇప్పుడు ఇనాయ వచ్చేసింది..రాబోయే రోజుల్లో ఇది మారొచ్చు కూడా..

ఇంతకు ముందు సీజన్స్ లో ఎవరు హౌస్ లో ఉంటారు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది స్పష్టంగా ముందే తెలిసిపోయేది..కానీ ఈ సీజన్ లో మాత్రం ఊహించనివే జరుగుతూ వస్తున్నాయి..అందుకు ఉదాహరణ గత మూడు వారాల నుండి జరుగుతున్న ఎలిమినేషన్స్..ఇదంతా పక్కన పెడితే ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో శ్రీహాన్ – శ్రీ సత్య మధ్య జరిగిన ఒక సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ట్రోల్ అవుతుంది.

అదేమిటి అంటే.. నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్కులో స్నేహితులైన రేవంత్ -శ్రీ సత్య – శ్రీహాన్ మధ్య చిన్న గొడవ ఏర్పడింది..రేవంత్ తో టాస్కు విషయంలో శ్రీహాన్ -శ్రీ సత్య గొడవలకు దిగారు..దీని గురించి శ్రీహన్ స్వయంగా శ్రీ సత్య తో మాట్లాడుతూ ‘నేను రేవంత్ విషయం లో ఏమైనా తప్పు చేసానా’ అని అడుగుతాడు..అప్పుడు శ్రీ సత్య ‘లేదే..ఎందుకు అలా అడుగుతున్నావు’ అని అంటుంది..అప్పుడు శ్రీహన్ ‘అదేమీ లేదు..జనాలకి ఏమైనా నెగటివ్ గా వెళ్తుందా అని అంతే’ అని అంటాడు..దీనికి శ్రీ సత్య ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద ట్రోల్ మెటీరియల్ గా మారింది.

ఆమె మాట్లాడుతూ ‘జనాల దృష్టిలో నువ్వు టైటిల్ విన్నర్..నేను రన్నర్..మనం ఒకవేళ తప్పు చేసినా కూడా అది వాళ్ళ దృష్టిలో కరెక్ట్ అయిపోతుంది’ అని సమాధానం ఇస్తుంది.. ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదని..గీతూ కూడా అలాగే అనుకోని చివరికి టాప్ 10 కంటెస్టెంట్స్ లో కూడా స్థానం దక్కించుకోకుండా ఎలిమినేట్ అయ్యింది.. కాబట్టి కాస్త భూమి మీదకి రండి అంటూ నెటిజెన్స్ ట్రోల్ల్స్ వేస్తున్నారు.