IND vs ENG IPL BAN : ఐపీఎల్ ను నిషేధించండి: ఇప్పుడిదే ట్రెండింగ్

IND vs ENG IPL BAN : భారత జట్టు గెలిస్తే ఆకాశానికి ఎత్తేస్తారు. అదే ఓడిపోతే కిందకు పడేస్తారు. ఎందుకంటే మన దేశంలో క్రికెట్ అనేది అంతలా జీర్ణించుకు పోయింది కాబట్టి. అక్కడిదాకా ఎందుకు మొన్న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఇండియా గెలిస్తే దేశం మొత్తం సంబరాలు జరిగాయి. దీపావళి ముందే వచ్చిందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు హోరెత్తాయి. ఇండియా గెలవడంతో డిస్నీస్టార్ లాంటి కార్పొరేట్ సంస్థకు వందల కోట్లలో ఎండార్స్మెంట్లు వచ్చాయి. కానీ ఇవాళ […]

Written By: Bhaskar, Updated On : November 10, 2022 8:02 pm
Follow us on

IND vs ENG IPL BAN : భారత జట్టు గెలిస్తే ఆకాశానికి ఎత్తేస్తారు. అదే ఓడిపోతే కిందకు పడేస్తారు. ఎందుకంటే మన దేశంలో క్రికెట్ అనేది అంతలా జీర్ణించుకు పోయింది కాబట్టి. అక్కడిదాకా ఎందుకు మొన్న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఇండియా గెలిస్తే దేశం మొత్తం సంబరాలు జరిగాయి. దీపావళి ముందే వచ్చిందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు హోరెత్తాయి. ఇండియా గెలవడంతో డిస్నీస్టార్ లాంటి కార్పొరేట్ సంస్థకు వందల కోట్లలో ఎండార్స్మెంట్లు వచ్చాయి. కానీ ఇవాళ జరిగిన సెమీస్ మ్యాచ్లో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవి చూడడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత జట్టు కోచ్ ద్రావిడ్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ దాకా అందర్నీ ఏకీపారేస్తున్నారు.
ఐపీఎల్ వద్దు
పుష్కర కాలం క్రితం కంటే ప్రారంభమైన ఐపీఎల్ క్రికెట్ చరిత్రలోనే ఒక గేమ్ చేంజర్. ఏకంగా ఫుట్బాల్ లీగ్ మ్యాచ్లను బీట్ చేసింది. వందల కోట్ల వ్యాపారం నుంచి వేల కోట్ల దాకా ఎగబాకింది.  ఫలితంగా జెంటిల్మెన్ గేమ్ కాస్త కార్పొరేట్ గేమ్ అయింది. వెర్రి లాంటి వేలంలో కోట్లకు కోట్లు పోసి ఆటగాళ్ళను కార్పొరేట్ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. దీనివల్ల అసలు ఆట మరుగున పడిపోయి కేవలం డబ్బు మాత్రమే తెరపైకి వస్తోంది. దీనివల్ల మెజారిటీ ఆటగాళ్లు కేవలం ఐపిఎల్ సీజన్ లో మాత్రమే ఆడి.. మిగతా మ్యాచ్లో అంతంతమాత్రంగా ప్రదర్శన చూపుతున్నారు. అక్కడిదాకా ఎందుకు మొన్న టి20 మెన్స్ వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభ సందర్భంగా అసలు ఇందులో ఆడేందుకే వెస్టిండీస్ టీం అర్హత సాధించలేదు. కారణం ఏంటా అని ఆలోచిస్తే.. క్రికెటర్లకు సరైన ఆదాయ మార్గాలు లేక వారంతా కూడా లీగ్ మ్యాచ్లో ఆడుతున్నారు. వారి దృష్టి మొత్తాన్ని అక్కడే కేంద్రీకరిస్తున్నారు. జట్టు విషయానికి వస్తే పూర్తి ఆట తీరును ప్రదర్శించకపోవడంతో అసలు టి20 మెన్స్ వరల్డ్ కప్ సిరీస్లో ఆడే కనీస అర్హత ఆ జట్టు కోల్పోయింది. ఒకప్పుడు క్రికెట్ ను శాసించిన ఆ జట్టు ఇవాళ ఈ దుస్థితికి రావడం ఎవరూ ఊహించి ఉండరు.
క్రికెటర్ల వెర్షన్ ఇలా ఉంది
ఐపీఎల్ లాంటి సీరీస్ ప్రారంభమైనప్పుడు విదేశాల ఆటగాళ్లు సైతం ఇందులో  ఆడాల్సి ఉంటుంది. ఇది కోట్లతో పందెం కాబట్టి ఆటగాళ్లు కూడా తమ శక్తికి మించి ప్రదర్శన చేస్తూ ఉంటారు. దీనివల్ల దేశీయ జట్టుకు ఆడే సమయంలో తమ సామర్థ్యాలను కోల్పోతున్నారు. తరచూ గాయాల బారిన పడటం వల్ల ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో అంతగా ప్రదర్శన చూపడం లేదు. కేవలం ఐపిఎల్ మ్యాచ్లో ప్రతిభ చూపిన ఆటగాళ్లు ఇప్పుడు జాతీయ జట్టుకు ఎంపిక కాకుండా ఇంటి వద్దే ఉంటున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారత్ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో ట్విట్టర్లో బ్యాన్ ఐపిఎల్ అనేది ట్రెండింగ్ లో నిలిచింది. చాలామంది అభిమానులు భారత అటు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. బీసీసీఐ పెద్దలను సైతం వదిలి పెట్టడం లేదు. బహుశా ఇప్పట్లో ఈ వివాదం సర్దుమణిగే పరిస్థితి కనిపించకపోవచ్చు.