Bigg Boss 6 Telugu Inaya Adireddy : రూల్స్ ని అతిక్రమించిన ఆది రెడ్డి..గొడవకి దిగిన ఇనాయ

Bigg Boss 6 Telugu Inaya Adireddy : ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్కు ‘ల్యాడర్ vs స్నేక్’ గేమ్ చివరి దశకి చేరుకుంది..ఈ పోటీలో చివరిగా శ్రీ సత్య , ఆది రెడ్డి మరియు ఫైమా కెప్టెన్సీ పోటీదారులుగా మిగిలారు..నిన్న జరిగిన ‘వస్తా నీ వెనుక’ టాస్కు కి కొనసాగింపుగా జరిగిన ఈ పోటీ చాలా రసవత్తరంగా సాగింది..కెప్టెన్సీ పోటీ దారులుగా నిన్న ‘వస్తా నీ వెనుక’ టాస్కులో పాల్గొన్న మరీనా […]

Written By: NARESH, Updated On : November 11, 2022 12:10 pm
Follow us on

Bigg Boss 6 Telugu Inaya Adireddy : ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్కు ‘ల్యాడర్ vs స్నేక్’ గేమ్ చివరి దశకి చేరుకుంది..ఈ పోటీలో చివరిగా శ్రీ సత్య , ఆది రెడ్డి మరియు ఫైమా కెప్టెన్సీ పోటీదారులుగా మిగిలారు..నిన్న జరిగిన ‘వస్తా నీ వెనుక’ టాస్కు కి కొనసాగింపుగా జరిగిన ఈ పోటీ చాలా రసవత్తరంగా సాగింది..కెప్టెన్సీ పోటీ దారులుగా నిన్న ‘వస్తా నీ వెనుక’ టాస్కులో పాల్గొన్న మరీనా , రోహిత్ మరియు కీర్తి టాస్కు నుండి తొలగిపోయారు..సంచాలక్ గా వ్యవహరించిన రేవంత్ నిన్న తన బాధ్యతలను పూర్తిగా విస్మరించాడనే చెప్పాలి.

నిన్న టాస్కు జరుగుతూ ఉన్న సమయం లో బిగ్ బాస్ మధ్యలో కల్పించుకుని ఇక నుండి ఎవ్వరు కూడా తమ భుజాల మీద తగిలించుకున్న థెర్మో కోల్ బస్తాలను చేతులతో ముట్టుకోకూడదని రూల్ పెడుతాడు..అయితే ఆది రెడ్డి తన బస్తాని కాపాడుకునేందుకు చేతులను రిపీట్ గా వాడుతున్నప్పటికీ సంచలక్ రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం తో రోహిత్ కి ఆగ్రహం కట్టలు తెంచుకొని గొడవకి దిగుతాడు.

ఇక ఈరోజు టాస్కులో కూడా రేవంత్ సంచాలక్ గా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు..అందువల్ల ఆది రెడ్డి మరియు ఇనాయ మధ్య పెద్ద గొడవ ఏర్పడింది..గేమ్ ప్రారంభానికి ముందే రేవంత్ కలిసి మాత్రం ఆడకూడదు అని ఒక రూల్ పెడుతాడు..కానీ ఈ టాస్కులో ఆది రెడ్డి మరియు ఫైమా ఒకరిపై ఒకరు అట్టాక్ చేసుకోకుండా కలిసి ఆడుతారు..దీనిపై ఇనాయ గొడవకి దిగుతుంది..’గీతూ కూడా ఇలాగె చేసి ఇద్దరినీ గెలిపించి పోయింది..ఇప్పుడు మీరు ఆమె స్థానాన్ని తీసుకుంటున్నారా’ అంటూ ఆది రెడ్డి ని ప్రశ్నిస్తుంది ఇనాయ.

‘ఈ వీకెండ్ లో నాగార్జున గారు మేమిద్దరం కలిసి ఆడాము అని నిరూపిస్తే నేను బిగ్ బాస్ వదిలి వెళ్ళిపోతా’ అంటూ ఆది రెడ్డి ఇనాయ తో సవాలు చేస్తాడు..’ఆది రెడ్డి అనే వాడు ఎప్పుడు తప్పు చెయ్యడు’ అంటూ పెద్దగా అరిచి చెప్తాడు..’ఇలాగే నిజాయితీ..నీతి అంటూ మిమల్ని మీరు కావాలని ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు’ అంటూ ఇనాయ అంటుంది..ఆ తర్వాత ఏమి జరిగింది అనేది తెలియాలంటే ఈరోజు రాత్రి 10 గంటల వరుకు వేచి చూడాల్సిందే.