Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ లో మరో ఊహించని ఎలిమినేషన్..సూర్య అవుట్

Bigg Boss 6 Telugu: గత వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవ్వరు కలలో కూడా ఊహించని విధంగా టాప్ కంటెస్టెంట్ గా భావించే అర్జున్ ఎలిమినేట్ అవ్వడం సోషల్ మీడియా లో ఎలాంటి దుమారం ని రేపిందో మన అందరికి తెలిసిందే..టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలుస్తాడు అనుకున్న అర్జున్ కళ్యాణ్ 50 రోజులకే హౌస్ నుండి వెనుతిరగడం అందరిని షాక్ కి గురి చేసింది..దానికి కారణం ఆయన శ్రీ సత్య చెప్పినట్టు […]

Written By: NARESH, Updated On : October 29, 2022 7:56 pm
Follow us on

Bigg Boss 6 Telugu: గత వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవ్వరు కలలో కూడా ఊహించని విధంగా టాప్ కంటెస్టెంట్ గా భావించే అర్జున్ ఎలిమినేట్ అవ్వడం సోషల్ మీడియా లో ఎలాంటి దుమారం ని రేపిందో మన అందరికి తెలిసిందే..టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలుస్తాడు అనుకున్న అర్జున్ కళ్యాణ్ 50 రోజులకే హౌస్ నుండి వెనుతిరగడం అందరిని షాక్ కి గురి చేసింది..దానికి కారణం ఆయన శ్రీ సత్య చెప్పినట్టు ఆట ఆడడమే అని తెలుస్తుంది.

ఇక ఈ వారం కెప్టెన్ ఎవ్వరు లేకపోవడం తో ఇంట్లో ఉన్న 14 మంది నామినేషన్స్ లోకి వచ్చారు..ఈ వారం కెప్టెన్సీ టాస్కులో ఇంటి సభ్యుల ఆట తీరులో అనూహ్యమైన మార్పు రావడం తో వోటింగ్ లో కూడా మార్పులు వచ్చాయి..ఈ వారం కూడా ఊహించని ఎలిమినేషన్ జరిగిందని ఇండస్ట్రీ లో విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

ఈ వారం వోటింగ్ లో అందరికంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్నది సూర్య అట..ఇతను అంటే ఇంటి సభ్యులందరికి బాగా ఇష్టం..ముఖ్యం గా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతో ఇతను చాలా క్లోజ్ గా ఉంటాడు..వాళ్ళని చాలా గౌరవిస్తాడు కూడా..కానీ కొన్ని విషయాల్లో పూర్తిగా సాఫ్ట్ ఉండడం అతని బలహీనతగా చెప్పుకోవచ్చు..ఫిజికల్ టాస్కులలో కూడా సూర్య బాగా ఆడుతాడు..ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం లో కూడా అతనికి మించిన వాళ్ళు హౌస్ లో ఎవ్వరు లేరనే చెప్పాలి..తన మిమిక్రీ తో అందరిని అలరిస్తాడు..ఇక ఈ వారం కూడా టాస్కు అద్భుతంగా ఆది కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచాడు..అలాంటి కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు అని వార్తలు రావడం అందరిని షాక్ కి గురి చేస్తున్న అంశం.

ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులకు కూడా చిరాకు రప్పించే గీతూ ఇంకా హౌస్ లో కొనసాగుతుండడం..టాస్కులలో బాగా ఆడే కంటెస్టెంట్స్ ఒక్కకారిగా ఎలిమినేట్ చెయ్యడం చూస్తుంటే ఈసారి బిగ్ బాస్ సీసన్ మొత్తం రాజకీయంగానే జరుగుతుందని..అందుకే ఎంత ప్రయత్నం చేసిన ముందు సీసన్స్ రేంజ్ TRP రేటింగ్స్ రావడం లేదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ చెప్తున్నారు.