Ariyana Glory: బిగ్ బాస్ ఫేమ్ అరియనా అందాల నడుము వంపులతో మనసులు దోచేసింది. నాభి సొగసులతో గుండె గుల్ల చేసింది. చక్కగా చెక్కినట్లున్న నడుమును ప్రదర్శిస్తూ కుర్రాళ్లను బేజారు చేసింది. పైట లేకుండా పరువాలతో దాడి చేసింది. అరియనా లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బిగ్ బాస్ షోతో పాపులారిటీ తెచ్చుకున్న అరియనా అంతకంతకు సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తుంది.

యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన అరియనా గుర్తింపు కోసం పరితపిస్తుండగా… రామ్ గోపాల్ వర్మ దేవుడిలా దొరికాడు. అనుకోకుండా రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసే అవకాశం అరియనాకు దక్కింది. ఆయన ఒక్క దెబ్బతో ఆమెను ఫుల్ పాప్యులర్ చేశారు. సదరు ఇంటర్వ్యూలో అరియనా ఫిగర్ పై వర్మ హాట్ కామెంట్ చేశాడు. నిన్ను బికినీలో చూడాలని ఉందంటూ తన కోరిక బయటపెట్టారు. వర్మ ఇంటర్వ్యూతో పాటు అరియనాకు పాప్యులర్ అయ్యింది.
ఆ విధంగా ఆమెకు బిగ్ బాస్ సీజన్ 4 లో ఛాన్స్ వచ్చింది. వచ్చిన అరుదైన అవకాశాన్ని అరియానా గట్టిగా ఉపయోగించుకుంది. తన మాట తీరుతో మెరుగైన ఆటతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిరూపించుకున్నారు. ఇంటి సభ్యుల్లో ఎవరు తప్పు చేసినా నిలదీసే తత్త్వం, నమ్మిన విషయంపై గట్టిగా స్టాండ్ తీసుకోవడం అరియనాను ప్రత్యేకంగా నిలిపాయి. దాంతో ఏకంగా ఫైనల్ కి దూసుకెళ్లింది. బిగ్ బాస్ సీజన్ 4 లో అరియనా 4వ స్థానం పొందారు. ఒక దశలో టైటిల్ ఫేవరెట్ అన్న మాట వినిపించింది.

బిగ్ బాస్ షోతో అరియనా కెరీర్ గాడిన పడింది. బుల్లితెర షోస్ లో ఆమెకు అవకాశాలు పెరిగాయి. ఆమెకు గతం కంటే ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగింది. దెబ్బకు అరియనా లైఫ్ సెట్ అయ్యింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మరింత ఫేమ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. హాట్ ఫోటో షూట్స్ చేస్తూ జనాలు ఆమె అకౌంట్స్ ని ఫాలో అయ్యేలా చేస్తుంది. తరచుగా అరియనా గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉండగా అరియనా త్వరగా పెళ్లి చేసుకుంటానంటూ చెప్పుకొచ్చారు. భార్యగా ఇల్లు పిల్లలను చూసుకోవడం తనకు ఇష్టమని చెప్పుకొచ్చింది. ఆ మాటలు చెప్పి రెండేళ్లు దాటిపోయినా అరియనా పెళ్లి చేసుకోలేదు. మరోవైపు ఫ్రెండ్ అషురెడ్డి తో కలిసి విందులు విహారాలు చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.