Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీసన్ 6 ఈమధ్య కాలం లో ఎవ్వరు ఊహించని విధమైన మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది..గడిచిన సీసన్స్ తో పోలిస్తే ఈసారి బిగ్ బాస్ సీసన్ కి ఆశించిన స్థాయి TRP రేటింగ్స్ రాకపోవడమే అందుకు కారణం..ప్రేక్షకులలో మళ్ళీ ఆసక్తిని రేకెత్తించడానికి బిగ్ బాస్ అనేకమైన ట్విస్టులతో TRP రేటింగ్స్ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు..అందులో భాగంగానే ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్స్ కూడా ఎవ్వరు ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ తో ఉండబోతున్నట్టు సమాచారం..కాసేపటి క్రితం విడుదల చేసిన ప్రోమో లో నాగార్జున గారు కొంత మంది ఇంటి సభ్యులపై ఫైర్ అయ్యాడు.

అంతే కాకుండా ఈ శనివారం ఎవ్వరు సేవ్ అవ్వరని..డైరెక్ట్ ఎలిమినేషన్ ఉండబోతుంది అంటూ ఆ ప్రోమో లో ట్విస్ట్ ఇవ్వడం ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ అందరిని షాక్ కి గురి చేసింది..ఇంతకీ డైరెక్ట్ ఎలిమినేషన్ ద్వారా బయటకి వెళ్లిన ఇంటి సభ్యుడు ఎవరు అనేది మాత్రం సస్పెన్స్ లో ఉంచారు.
అయితే డైరెక్ట్ ఎలిమినేషన్ ఉన్నట్టు ప్రేక్షకులను మరియు ఇంటి సభ్యులను నమ్మించి , ఆ కంటెస్టెంట్ ని సీక్రెట్ రూమ్ లోకి పంపిస్తారని..అదే ట్విస్ట్ అయ్యి ఉంటుందని నెటిజెన్స్ అనుకుంటున్నారు..మరి ఇందులో ఏది నిజమో కాసేపట్లో తెలియనుంది..ఇక ఈ వారం నాగార్జున గారు రేవంత్ , గీతూ , శ్రీహన్ , శ్రీ సత్య మరియు సూర్య లపై బాగా ఫైర్ అయ్యినట్టు అర్థం అవుతుంది..ప్రోమో లో ఈ వారం గీతూ ఆడిన ఆట తీరుని నాగార్జున తీవ్రంగా తప్పుబట్టారు.
అంతే కాకుండా రేవంత్ కి కూడా గట్టిగానే కోటింగ్ ఇచ్చాడు..’చాలా అగ్రెసివ్ గా ఆడుతున్నావ్..అది లిమిట్ దాటేస్తుంది..ఒక్క మాటలో చెప్పాలంటే ఉన్మాది లాగ ఆడుతున్నావ్’ అంటూ నాగార్జున మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ప్రోమోలో చూపిన విధంగానే ఈ ఎపిసోడ్ మొత్తం ఫుల్ ఫైర్ మీద ఉంటుందా లేదా అనేది చూడాలి.
