https://oktelugu.com/

Mahesh Babu : ‘బిచ్చగాడు’ హీరో విజయ్ ఆంటోనీ దర్శకత్వంలో మహేష్ బాబు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ కామెంట్స్

బిచ్చగాడు 2 నాకు డైరెక్టర్ గా మొదటి సినిమా. నాకు తెలుగు లో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టం ఉంది.ఆయన కోసం నా దగ్గర ఒక్క అద్భుతమైన స్టోరీ ఉంది.ఆయన నాకు ఒక్క అవకాశం ఇస్తే ఆ సినిమా చేస్తాను'

Written By:
  • NARESH
  • , Updated On : May 16, 2023 / 10:12 PM IST
    Follow us on

    Mahesh Babu : ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధించిన డబ్బింగ్ సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి చిత్రాలలో ఒకటి బిచ్చగాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు మరియు తమిళం బాషలలో రాణించిన విజయ్ ఆంటోనీ ఈ చిత్రం లో హీరో గా నటించాడు.

    అప్పట్లో ఈ చిత్రానికి తెలుగు లో 15 కోట్ల రూపాయిల షేర్, తమిళం లో 10 కోట్ల రూపాయిల షేర్, రెండు భాషలకు కలిపి 25 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి నిర్మాతకు కాసుల కనకవర్షం కురిపించింది. ఈ చిత్రం విజయ్ ఆంటోనీ కి తెలుగు లో మంచి మార్కెట్ ని కూడా తెచ్చిపెట్టింది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సీక్వెల్ గా బిచ్చగాడు పార్ట్ 2 ఈ నెల 19 వ తేదీన తెలుగు మరియు తమిళం బాషలలో విడుదల కాబోతుంది.

    ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ కోసం విజయ్ ఆంటోనీ ఇంటర్వ్యూస్ వరుసగా ఇస్తున్నాడు.ఈ చిత్రం లో విజయ్ ఆంటోనీ కేవలం హీరో గా మాత్రమే కాదు, దర్శకుడిగా కూడా పని చేసాడు. డైరెక్టర్ గా ఇది ఆయనకీ మొట్టమొదటి సినిమా, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బిచ్చగాడు 2 నాకు డైరెక్టర్ గా మొదటి సినిమా. నాకు తెలుగు లో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టం ఉంది.ఆయన కోసం నా దగ్గర ఒక్క అద్భుతమైన స్టోరీ ఉంది.ఆయన నాకు ఒక్క అవకాశం ఇస్తే ఆ సినిమా చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.మరి విజయ్ ఆంటోనీ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. ఇక బిచ్చగాడు 2 కి సంబంధించి ఇది వరకు విడుదల చేసిన టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.కచ్చితంగా ఈ చిత్రం మొదటి భాగం కంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.