Sanjana Ramesh And Har Simran Kaur: మనదేశంలో ఎక్కువగా చదరంగం, టెన్నిస్, బ్యాడ్మింటన్, క్రికెట్, హాకీ మాత్రమే ఆడుతుంటారు. క్రీడల్లో ఎక్కువగా వీటి పేరు మాత్రమే ప్రస్తావనకు వస్తూ ఉంటుంది. స్కూళ్లల్లో, కాలేజీలలో, యూనివర్సిటీ స్థాయిలో బాస్కెట్ బాల్ ఆడుతారు గాని.. తర్వాత వీటి ప్రస్తావన అంతగా ఉండదు.
ఇప్పుడు ఈ క్రీడకు కూడా ప్రాధాన్యం లభిస్తోంది. బాస్కెట్ బాల్ కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం భారతీయులు సంజనా రమేష్, హర్ సిమ్రాన్ కౌర్. వీళ్లు మన దేశంలో అదరగొట్టిన తర్వాత.. విదేశాలలో సత్తా చూపిస్తున్నారు.
సంజన రమేష్
సంజన రమేష్ బాస్కెట్ బాల్ క్రీడలో ప్రవేశించడం యదృచ్ఛికంగా జరిగింది. ఈమె సోదరుడు కూడా ఈ క్రీడలో అద్భుతమైన ఆటగాడు. అయితే ఎప్పుడు కూడా ఆమెను బంతిని తాకించేవాడు కాదు. ఆమెను గ్రౌండ్ కి తీసుకెళ్లి.. విపరీతంగా పరుగులు పెట్టించాడు. బంతిని తాకే అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో సంజన రమేష్ బాస్కెట్ బాల్ ప్లేయర్ కావాలని నిర్ణయించుకుంది. సంజనది చెన్నై. కాకపోతే స్థిరపడింది బెంగళూరులో. టీం లేకపోవడంతో స్కూల్లో ప్రాక్టీస్ చేసే అవకాశం ఆమెకు లభించలేదు. పాత బంతితో సంజన ఒక్కతే ప్రాక్టీస్ చేసేది.. ఆమె పట్టుదల కోచ్ లను ఆకర్షించింది. 12 సంవత్సరాల వయసులో ఆ క్రీడలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది.. అండర్ 16 టీం లో చోటు దక్కించుకుంది.. షిబా ఏసియన్ ఛాంపియన్షిప్ లో భారత జట్టును సారధిగా ముందుండి నడిపించింది. అయితే అప్పట్లోనే ఆమెకు యూరోపియన్, ఆస్ట్రేలియన్ లీగ్లలో ఆడాలని కోరిక ఉండేది.. ఆ కోరిక తగ్గట్టుగానే ఆమె ఎన్సీఏఏ డివిజన్ -1 ఉపకార వేతనాన్ని అందుకుంది. దీంతో ఆమెను తీసుకోవడానికి అమెరికాలోని ఎన్నో విశ్వవిద్యాలయాలు ముందుకు వచ్చాయి. ఇదే క్రమంలో ఆమె కాలుకు గాయం అయింది. ఫలితంగా నార్తర్న్ అరిజోనా యూనివర్సిటీ మాత్రమే ఆమెను చేర్చుకోవడానికి ముందుకు వచ్చింది.. ఆ యూనివర్సిటీలో చేరిన తర్వాత సంజన తన ఆట తిను పూర్తిగా మార్చుకుంది. వివిధ టోర్నీలలో సత్తా చూపించింది. గోల్డెన్ ఈగల్ స్కాలర్షిప్ అథ్లెట్ పురస్కారం అందుకుంది. ప్రస్తుతం ఆమె భారత బాస్కెట్బాల్ సీనియర్ జట్టులో సత్తా చూపిస్తోంది. అంతేకాదు ఈ ఏడాది ఫిబా ఉమెన్ ఏషియా కప్ లో భారత జట్టుకు సారధిగా వ్యవహరించింది. “అద్భుతమైన ప్లేయర్ గా గ్రూప్ అంతరించి ఉండాలి. మన దేశంలో కూడా బాస్కెట్బాల్ క్రీడకు గుర్తింపు తీసుకురావాలి. ముఖ్యంగా ఈ క్రీడ ఆడే విధంగా అమ్మాయిలను ప్రోత్సహించాలని” సంజన చెబుతోంది.
హర్ సిమ్రాన్ కౌర్
పేరుకు అమ్మాయి అయినప్పటికీ.. ఈమె లక్షణాలు మొత్తం అబ్బాయిలను మించి ఉంటాయి. మైదానంలోకి దిగింది అంటే బంతిని ప్రత్యర్ధులు తాకనీయకుండా చేస్తుంది. చిరుత పులి మాదిరిగా పరుగులు పెడుతూ ఉంటుంది. యూరప్ ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ లీగ్ ఆడిన తొలి ఇండియన్ మహిళగా సిమ్రాన్ రికార్డర్ సృష్టించింది. ఈమె తల్లి సుమన్ ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్. తండ్రి సుఖదేవ్ జాతీయస్థాయి బాస్కెట్బాల్ ప్లేయర్. వీళ్లది పంజాబ్లోని కపూర్తల ప్రాంతం. తండ్రి ఆడుతున్నప్పుడు మ్యాచ్ లు చూసేందుకు సిమ్రాన్ వెళ్ళేది. ఏడు సంవత్సరాల వయసులోనే తండ్రి దగ్గర శిక్షణ తీసుకోవడం మొదలు పెట్టింది. మొదట్లో ఇబ్బంది పడింది. ఆ తర్వాత హేళనలు కూడా ఎదుర్కొంది.. 2018లో తనకు 15 సంవత్సరాల వయసులో నోయిడా లోని ఎన్బీఏ అకాడమీ ఉమెన్స్ ప్రోగ్రాం ఇండియా శిబిరానికి ఎంపికైంది. ఆ తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు సొంతం చేసుకుంది.. ఆస్ట్రేలియాలోని ఎంబీఏ గ్లోబల్ అకాడమీకి ప్రయాణం సాగించింది. ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ రాకపోవడంతో ఇబ్బంది పడేది. ఆ తర్వాత కొంతకాలానికి అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ శాండియాగో, యూనివర్సిటీ ఆఫ్ రోడ్ ఐలాండ్ జట్ల తరఫున ఆడింది. ఈ సంవత్సరం గ్రీస్ దేశానికి సంబంధించిన ఓ ఫ్రాంచైజీకి ఎంపికైంది.