Dubbing Janaki : సీనియర్ హీరోయిన్స్ లో డబ్బింగ్ జానకి గురించి తెలియని వాళ్లంతా ఉండరు.ఎందుకంటే ఈమె ఈ వయస్సు లో కూడా ఇప్పటికీ టీవీ సీరియల్స్ లో క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈమె సుమారుగా సౌత్ ఇండియా లో ఉన్న అన్నీ భాషలకు కలిపి 600 చిత్రాల్లో నటించింది.సినిమానే శ్వాసగా, సినిమానే ఊపిరి గా ఈమె బ్రతుకుతుంది.
9 ఏళ్ళ వయస్సులోనే నాటక రంగం లో మెప్పించిన ఈమె, ‘భూకైలాస్’ చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసింది.ఆ సినిమా భారీ హిట్ అవ్వడం తో జానకి కి వరుసగా సినిమాల అవకాశాలు క్యూ కట్టాయి. ఆకలి తో అలమటించిన రోజుల నుండి 750 రూపాయిలు ఒక్కో సినిమాకి పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగింది.ఆరోజుల్లో 750 రూపాయిలు అంటే సాధనమైన విషయం కాదు.అప్పట్లో హీరోయిన్స్ లో ఈమెకే ఎక్కువ పారితోషికం అట.
ఇక ఈమెకి డబ్బింగ్ జానకి అనే పేరు ఎలా వచ్చిందంటే అప్పట్లో తెలుగు లో గాంధీ అనే చిత్రం వచ్చింది. ఈ చిత్రం లో కస్తూరిబా పాత్రకి డబ్బింగ్ చెప్పినందుకు గాను ఆమె పేరు అప్పటి నుండి డబ్బింగ్ జానకి గా మారిపోయింది. ఆరున్నర దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సినీ జీవితం లో ఆమెకి ఎదురైనా కొన్ని చేదు జ్ఞాపకాలను చెప్పుకుంది.
ఒకానొక సందర్భం లో అప్పట్లో ఒక సినిమా కోసం ఒక స్టార్ హీరోయిన్ తో పాటుగా జానకి గారికి కూడా రూమ్ బుక్ చేశారట.నాకు త్వరగా తిని నిద్రపోయే అలవాటు ఉందట, షూటింగ్ నుండి రాగానే బాక్స్ లో కొద్దిగా తినేసి పడుకున్నానని,ఆమె రాకముందే నేను క్యారేజ్ బాక్స్ ఓపెన్ చేశాననే కోపం తో క్యారేజ్ బాక్స్ ని కాలు తో ఒక తన్ను తన్నింది అని, నేను అదేమీ పట్టించుకోకుండా నా పని నేను చేసుకుపోయాను అంటూ చెప్పుకొచ్చింది జానకి.