BheemlaNayak Trailer Storm: రీల్ లైఫ్ లో అయినా.. రియల్ లైఫ్ లో అయినా పవన్ కళ్యాణ్ లోని ఆ నాయకుడిని ఎవరూ మర్చిపోరు. తెరపై కనిపించినా.. తెర బయట ప్రజల్లో తిరిగినా ఆ అభిమానం అనేది పోదు. పవన్ కు ఉన్న ఆ డైహార్ట్ ఫ్యాన్స్ మరెవరికి ఉండరు. అందుకే పవన్ అంటే అందరికీ పిచ్చి. ఆయన సినిమా కోసం అందరూ ఎదురుచూసేది. ఆయన సినిమా నుంచి ఏదో వచ్చినా అభిమానులకు ఒక పండుగే.
BheemlaNayak Trailer Storm
పవన్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ నుంచి ఒక శుభవార్త అందింది. ఆ చిత్రానికి సంబంధించిన ‘ట్రైలర్ ’ను 21న రిలీజ్ చేయబోతున్నట్టు ఒక పోస్టర్ ద్వారా చిత్రం యూనిట్ తెలిపింది. ఈ పోస్టర్ చూస్తుంటే పవన్ ఫ్యాన్స్ రోమాలు నిక్కబొడవడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: ఆ ప్రాంతాల్లో కూడా స్టూడియోలు కట్టాలంట.. జగన్ పెద్ద ప్లానే వేశారే..!
ఒక బుల్లెట్ బండిపై పవన్ కళ్యాణ్ ఏదో సాధించి వస్తుండగా.. ఆయన చుట్టు ఉన్న జనాలు చేతులు జోడించి ఆయనను మొక్కుతున్న పిక్ దుమ్మురేపేలా ఉంది. ఆ బైక్ వస్తుంటే నిజంగానే వెనుక దుమ్ము రేగింది అది వేరే విషయం . ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 21న రాబోయే టీజర్ పై అంచనాలను అమాంతం పెంచేసింది.
Also Read: మంచు ఫ్యామిలీని ట్రోల్ చేయడానికి కారణాలు ఇవే
అయ్యప్పమ్ కోషియం అనే మలయాళీ చిత్రం రిమేక్ గా వస్తున్న ‘భీమ్లానాయక్’లో పవన్, రానా కొదమ సింహాల్లా తలపడబోతున్నారని టీజర్ లు చూస్తే అర్థమవుతోంది. తాజాగా 21న కూడా పవన్ మేనరిజాన్ని కొత్త ట్రైలర్ లో చూపించబోతున్నారు. ఈ పోస్టర్ చూస్తేనే పవన్ ప్రజలను ఆదుకునే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడని అర్థమవుతోంది. పోస్టర్ తోనే ఫ్యాన్స్ ను ఫిదా చేసిన టీం.. ఇక 21న ట్రైలర్ తో మరెంత ఆకట్టుకుంటుందో చూడాలి. అప్పటివరకూ ఫ్యాన్స్.. ఉగ్గబట్టుకొని ఉండాల్సిందే..
https://twitter.com/SitharaEnts/status/1494983886836699137?s=20&t=oucvFyNKtS31UCc-ZIBHNw