https://oktelugu.com/

Mehreen Pirzada: ఆ హీరోయిన్ పడిపోయిందనే స్థితిలోనే మళ్ళీ లేస్తోంది !

Mehreen Pirzada:  బబ్లీ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా కెరీర్ గ్రాఫ్ మొదటి నుంచి మిగిలిన హీరోయిన్స్ కంటే భిన్నంగా వస్తూ ఉంది. హిట్లు ఉండవు, ఫేడ్ అవుట్ దశలోకి వెళ్ళిపోతుంది. ఇక ఛాన్స్ లు రావడం ఆగిపోయాయి అనుకున్న సమయంలో.. మళ్ళీ సడెన్ గా మెహ్రీన్ పిర్జాదాకి వరుస ఛాన్స్ లు వస్తాయి. మరి ఈ ఛాన్స్ లు వెనుక ఎవరు ఉన్నారో తెలియదు గానీ, మెహ్రీన్ పిర్జాదాకి కెరీర్ అయిపోయిందనే పరిస్థితిలోనే మళ్ళీ ఆమె కెరీర్ […]

Written By:
  • Shiva
  • , Updated On : February 19, 2022 / 04:14 PM IST
    Follow us on

    Mehreen Pirzada:  బబ్లీ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా కెరీర్ గ్రాఫ్ మొదటి నుంచి మిగిలిన హీరోయిన్స్ కంటే భిన్నంగా వస్తూ ఉంది. హిట్లు ఉండవు, ఫేడ్ అవుట్ దశలోకి వెళ్ళిపోతుంది. ఇక ఛాన్స్ లు రావడం ఆగిపోయాయి అనుకున్న సమయంలో.. మళ్ళీ సడెన్ గా మెహ్రీన్ పిర్జాదాకి వరుస ఛాన్స్ లు వస్తాయి. మరి ఈ ఛాన్స్ లు వెనుక ఎవరు ఉన్నారో తెలియదు గానీ, మెహ్రీన్ పిర్జాదాకి కెరీర్ అయిపోయిందనే పరిస్థితిలోనే మళ్ళీ ఆమె కెరీర్ మొదలవుతుంది.

    Mehreen Pirzada

    ఏది ఏమైనా మెహ్రీన్ పిర్జాదా గ్రేటే. టాలెంట్ లేకపోయినా ఎక్స్ ప్రెషన్స్ పలికించలేకపోయనా ఎక్స్ పోజింగ్ తో తన గ్లామర్ తో మొత్తానికి బండిని నడిపిస్తూ వస్తోంది. పైగా ఈ బబ్లీ బ్యూటీ టాలీవుడ్ లో ఛాన్స్ లతో పాటు బాగా క్యాష్ చేసుకుంటుంది. నిజానికి గత నాలుగేళ్లుగా తెలుగులో మెహ్రీన్ పిర్జాదాకు చెప్పుకోదగ్గ స్థాయిలో అవకాశాలు రాలేదు.

    Also Read: యాడ్స్ ద్వారా మహేష్ సంపాదన ఎంత..? ఆ మొత్తం ఏం చేస్తాడో తెలుసా?

    మెహ్రీన్ పిర్జాదా తన హ‌వా టాలీవుడ్ లో త‌గ్గుముఖం పట్టిందని అర్ధం అవ్వగానే రూట్ మారుస్తోంది. కొన్ని నెలల పాటు తమిళంలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ చేస్తూనే.. తెలుగులోని తన సన్నిహిత హీరోలతో, దర్శకులతో నిత్యం టచ్ లో ఉంటుంది. చివరకు ఛాన్స్ లు పట్టేస్తోంది. ఏమైనా చిన్న సినిమాల‌తో ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ పిర్జాదా మీడియం రేంజ్ హీరోల వరకు వచ్చింది.

    Mehreen Pirzada

    పైగా అతి తక్కువ కాలంలోనే ఫామ్ లో ఉన్న యంగ్ హీరోల స‌ర‌స‌న వ‌ర‌స‌గా అవ‌కాశాలు అండుకుంటుంది. కానీ మెహ్రీన్ కి మాత్రం స్టార్ హీరోలు ఛాన్స్ లు ఇవ్వడం లేదు. దాంతో తెలుగులో ఏవరేజ్ రేంజ్ హీరోల‌తో మాత్ర‌మే మెహ్రీన్ పిర్జాదా నటించగలిగింది. అయితే, ప్రస్తుతం అలాంటి సినిమాలు కూడా తనకు రావడం లేదని గ్రహించి తెలుగుకి గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం కన్నడంలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది.

    ఇక ఈ ‘బబ్లీ బ్యూటీ హీరోయిన్ గా చేసిన ‘మంచి రోజులొచ్చాయి’ సినిమాకి డబ్బులు రాలేదు. దర్శకుడు మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో మ్యాటర్ లేకపోవడంతో హిట్ అవ్వలేదు. మొత్తమ్మీద మెహ్రీన్‌ కెరీర్ ఆగుతూ సాగుతూ ఉంది.

    Also Read: ఆ ప్రాంతాల్లో కూడా స్టూడియోలు క‌ట్టాలంట‌.. జ‌గ‌న్ పెద్ద ప్లానే వేశారే..!

    Recommended Video:

    Tags