Bheemla Nayak Collections: భీమ్లానాయక్’ మూవీలో పవన్ కళ్యాన్ చూపించిన విశ్వరూపానికి బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతున్నాయి. పవన్ ఫ్యాన్స్ అయితే సినిమా చూసి పిచ్చెక్కిపోతున్నారు. పవన్ యాక్షన్, రానా పర్ ఫామెన్స్ కు మెంటల్ ఎక్కి పోతోందంటున్నారు. ఇద్దరు కొదమసింహాల్లా నటించారని చెబుతున్నారు. పబ్లిక్ టాక్స్ లో అయితే లేడి అభిమానులు సైతం అరుపులు, కేకలతో పవన్ కళ్యాణ్ మూవీ బ్లాక్ బస్టర్ అంటూ గోల చేస్తున్నారు.
వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ అంతటి గొప్ప పవర్ ఫుల్ క్యారెక్టర్ ద్వారా భీమ్లానాయక్ తో వస్తున్నారు. ఆ విజయ పరంపరను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అమెరికాలో ఇప్పటికే ప్రీ షోస్ పడ్డాయి. అమెరికా వ్యాప్తంగా భీమ్లా నాయక్ ఇప్పటికే 122 థియేటర్లలో విడుదలైంది. ముందస్తు బుకింగ్స్ తో 5,00,000 డాలర్ల మార్క్ ను అధిగమించి సంచలనం సృష్టించింది.
ఇక రేపు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోంది. ఈ ఊపు చూస్తుంటే ఖచ్చితంగా పుష్ప, అఖండ మూవీ రికార్డులు కొట్టుకుపోవడం కనిపిస్తోంది.ఇప్పటికే అఖండ రికార్డులను అధిగమించిన ‘భీమ్లానాయక్’ మూవీ ఇప్పుడు ‘పుష్ప’ రికార్డులను కూడా అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో అత్యధిక వసూళ్లు సాధించే చిత్రంగా ‘భీమ్లానాయక్’ నిలుస్తుందని చెప్పొచ్చు.
ఇక భీమ్లానాయక్ విడుదలైన అన్ని చోట్ల రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాలే కాదు.. ఓవర్సీస్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చుకుంది. దీంతో తొలి రోజు పూర్తిగా నిండిపోయిన థియేటర్లు ఈ వీకెండ్ కూడా ముందస్తు బుకింగ్ లు అయ్యాయి.
ఈ ఊపు చూస్తుంటే ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లోనే భీమ్లానాయక్ 100 కోట్లు కొల్లగొట్టడం తథ్యం అని అనలిస్టులు పేర్కొంటున్నారు. బాహుబలి రికార్డులు సైతం కొట్టుకుపోవడం తథ్యమంటున్నారు..
భీమ్లానాయక్ రిలీజ్ కు ముందు టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన చిత్రాలు రెండు. అవి ‘అఖండ’, ‘పుష్ప’. ఇక కరోనా కల్లోలం వేళ ఆంక్షల మధ్య విడుదలైన ‘అఖండ’ మూవీ 69.40 కోట్లు టోటల్ వసూలు చేసింది. థియేటర్లపై ఆంక్షలు.. 50శాతం అక్యూపెన్సీ ఉన్న సమయంలోనే విడుదలైన అఖండ 69.40 కోట్లు సాధించి లాభాల బాటపట్టింది. సినిమా బడ్జెట్ ను మించి వసూళ్లు సాధించింది బాలయ్య ‘అఖండ’ చిత్రం.
Also Read: Bheemla Nayak Politics: భీమ్లానాయక్ రాజకీయం.. కేసీఆర్ అలా.. జగన్ ఇలా.. ఏంటీ రచ్చ..?
ఇక పుష్ప సినిమా తెలుగులోనే కాదు.. దక్షిణాది, బాలీవుడ్ లో కూడా రిలీజ్ అయ్యింది. రికార్డుల మోత మోగించింది. పుష్ప టోటల్ కలెక్షన్స్ రూ.311 కోట్లుగా ఉంది. ఇక భీమ్లా నాయక్ కలెక్షన్ల సునామీనీ మొదలు పెట్టింది. అమెరికా వ్యాప్తంగా భీమ్లా నాయక్ ఇప్పటికే 122 థియేటర్లలో విడుదలైంది. ముందస్తు బుకింగ్స్ తో 5,00,000 డాలర్ల మార్క్ ను అధిగమించి సంచలనం సృష్టించింది.
ఇక రేపు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోంది. ఈ ఊపు చూస్తుంటే ఖచ్చితంగా అఖండ, పుష్ప మూవీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది
Also Read: Bheemla Nayak Ticket Price in AP: భీమ్లానాయక్ టికెట్ రేట్స్ చూస్తే మీ గూబ గుయ్ మంటది?