Devotional Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం భగవంతుడికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేస్తుంటారు.ఈ క్రమంలోనే స్వామివారికి పూజ చేసే సమయంలో మనం వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి పూజ చేయడం చేస్తుంటాము. కేవలం ఇంట్లోనే కాకుండా ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా స్వామివారికి మన ఇంటి ఆవరణంలో వికసించిన పుష్పం తీసుకెళ్లి సమర్పిస్తాము.అయితే ప్రతి ఒక్క దేవుడికి కూడా ఎంతో ప్రీతికరమైన పుష్పం ఉంటుంది అలాంటి పుష్పాలతో పూజ చేయటం వల్ల ఆ స్వామివారి అనుగ్రహం మనపై ఉంటుంది. మరి ఏ దేవునికి ఏ పుష్పాలతో పూజ చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం…
దేవ దేవతలలో మొదట పూజలు అందుకునే వినాయకుడికి అదేవిధంగా ఈ సమస్త కోటికి జీవనాధారమైన సూర్యభగవానుడికి తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజ చేయడం వల్ల వారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. అలాగే విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామికి తులసీదళాలతో, తులసి మాలలను సమర్పించి పూజ చేయటం వల్ల స్వామివారి ప్రీతి చెంది వారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండేలా చేస్తారు. ఇక మహాలక్ష్మిని పూజించేటప్పుడు తామర పుష్పాలతో పూజించాలి.
Also Read: మంత్రి గౌతంరెడ్డి ఫ్యామిలీ సంచలనం.. ప్రభుత్వానికి కోట్ల ఆస్తులు.. ఆయన పేరుతో యూనివర్సిటీ
ఇక శ్రీ చక్రాన్ని పూజించే సమయంలో తప్పనిసరిగా తులసిదళాలు ఉండాలి తులసిదళాలతో శ్రీ చక్రాన్ని పూజించడం వల్ల మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అంత మంచే జరుగుతుంది శ్రీచక్రానికి గన్నేరు జాజిపూలు వంటి పుష్పాలతో కూడా పూజ చేయవచ్చు. ఇక ఆంజనేయస్వామికి ఎర్రటి పుష్పాలతో లేదా ఎర్రటి మందారాలతో పూజించడం ఎంతో మంచిది. ఇక పరమేశ్వరుడికి మారేడు దళాలు ఎంతో ప్రీతికరమైనది మారేడు దళాలు స్వామివారికి సమర్పించి పూజలు చేయటం వల్ల స్వామివారి ప్రీతి చెంది అనుకున్న కోరికలు నెరవేరుస్తారు.
Also Read: ప్చ్.. సినిమా టికెట్ల కోసం గొంతు కోయడం ఏమిటయ్యా ?
Recommended Video: