Viveka Murder Case: కడప జిల్లాలో సంచలనం రేపిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చిక్కుముడి వీడటం లేదు. సీబీఐ దర్యాప్తు చేపట్టడంతో కొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్ కుటుంబీకులే హత్యలో ప్రమేయం ఉన్నట్లు తేలడంతో వైసీపీకి ఎదురుదెబ్బలే తగలనున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోసిన వైసీపీ నేతలు ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. తాము చేసిన తప్పిదాలకు తలవంపులు తెచ్చినట్లుగా భావిస్తూ తలలు పట్టుకుంటున్నారు. కేసు ముమ్మరంగా దర్యాప్తు చేయడంతో కొన్ని కీలక విషయాలు తెలుస్తున్నాయి.
వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలు ప్రధాన పాత్రధారులుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిపై కేసులు నమోదు చేసేందుకు సీబీఐ కూడా వెనుకంజ వేస్తోంది. దీంతో కేసు పురోగతిపై అందరికి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొదట సాధారణ మరణంగా భావించినా ఇందులో ఒక్కొక్కటిగా సాక్ష్యాలు బహిర్గతం అవుతుండటంతో కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది.
Also Read: ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు షాకిచ్చిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్
వివేకానంద రెడ్డి వద్ద టైపిస్టుగా పనిచేసిన షేక్ ఇనయతుల్లా ఇచ్చిన సమాచారం మేరకు వాస్తవాలు తెలుస్తున్నాయి. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఇనయతుల్లా పలు కీలక విషయాలు వెల్లడించాడు. వైఎస్ వివేకానందరెడ్డి డెడ్ బాడీని మొదట చూసింది అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి అని పేర్కొన్నాడు. దీంతో వివేకాకు అంటిన రక్తపు మరకలను తుడిచేందుకు ప్రయత్నించారని తెలిపాడు. దీంతో తాను వీడియో తీస్తుంటే ఎందుకని బెదిరించారని వివరించాడు.
దీంతో వైఎస్ వివేకా హత్య కేసుగా గుర్తించడంతో పలు కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. సీఐ శంకరయ్య ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా సీబీఐ నమోదు చేసింది. ఆయన కూడా చెప్పిన వివరాలు వీరిని దోషులుగా తేల్చేవిగా ఉన్నాయి. దీంతో కేసులో సీబీఐ ఏ మేరకు ముందుకు వెళ్తుందో తెలియడం లేదు. వైఎస్ కుటుంబీకులే కావడంతో వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ వివేకా కూతురు సునీత డిమాండ్ చేస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతోంది. దీనికి గాను ఆమె టీడీపీలో చేరేందుకు కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Also Read: ప్రభుత్వ చర్యల వల్ల ఆంధ్రలో ఆ సామాజిక వర్గాన్ని మాత్రమే కాక తటస్తులను కూడా పవన్ కళ్యాణ్ ఆకర్షించాడా?