Bengal Old Couple Emotional Video: వివాహ బంధాలు విచ్చిన్నమవుతున్నాయి.. అనుబంధాలు మాయమవుతున్నాయి. ప్రేమలు గాలిలో దీపమవుతున్నాయి. ఇలాంటి చోట.. కొడిగట్టిన దీపంలా కొంతమంది ఆప్యాయతను నిరూపిస్తున్నారు.. అనురాగాన్ని ప్రదర్శిస్తున్నారు. భార్యా భర్తలు అంటే ఇలానే ఉంటారని నిరూపిస్తున్నారు. అలాంటిదే ఈ వీడియో కూడా.
Also Read: తాగి స్కూల్ బస్సు నడిపిన.. శ్రీ చైతన్య డ్రైవర్.. అధికారుల తనిఖీలో దారుణం
ప్రేమ అనేది విశ్వ జనీనమైనది. అది ఎదుటి వ్యక్తి సంతోషాన్ని మాత్రమే కోరుకుంటుంది. వారిలో ఆనందాన్ని మాత్రమే చూస్తుంది. కాకపోతే నేటి కాలంలో ఇలా ఎవరు కోరుకోవడం లేదు. ఎంతసేపటికి నేనేంటి? నాకేంటి? ఎంత వస్తుంది? ఎంత దక్కుతుంది? అనే కోణాలలో మాత్రమే ఆలోచిస్తున్నారు. ఇందుకు దాంపత్యం కూడా మినహాయింపు కాదు. ఇటీవల కాలంలో చూస్తున్న దారుణాలు, ఘోరాలు అన్నీ ఈ కోవలోనివే. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న వారు మాత్రం అందుకు భిన్నం.
భార్యకు మాంగళ్యం కొనివ్వడానికి..
వారిద్దరూ భార్యాభర్తలు. భర్త వయసు 93 సంవత్సరాలు. భార్య వయసు దాదాపుగా 80 కి పైగానే ఉంటుంది.. ఇద్దరిని చూస్తుంటే అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా కనిపిస్తున్నారు. పైగా వారిది పేద కుటుంబం అనుకుంటా. జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఇక్కడదాకా వచ్చారు అనుకుంటా. ఇన్నాళ్లకు అన్ని బాధలు తీరిపోయిన తర్వాత.. తనతో ఇంతటి సుదీర్ఘ ప్రయాణం చేసిన భార్యకు ఏదైనా కొనివ్వాలని అతడికి అనిపించింది. ఇందులో భాగంగానే ఆమెను ఓ షాప్ కి తీసుకెళ్లాడు. మొదట్లో వారిద్దరిని ఆ షాపులో పనిచేసే వారు యాచకులు అనుకున్నారు. వారిని అదే విధంగా చూశారు. ఇదే సమయంలో ఆ షాప్ యజమాని వారి దగ్గరికి వచ్చాడు.. వారితో ప్రేమగా మాట్లాడాడు. ఏం కావాలని అడిగాడు..” నా భార్య మెడ మీద మాంగల్యం లేదు. ఆమెకు ఒక మాంగల్యం కావాలని” ఆ షాప్ అతని తో ఆ వృద్ధుడు చెప్పాడు.
₹20 మాత్రమే తీసుకొని..
ఆ వృద్ధుడు తన భార్య కోసం మాంగల్యం కావాలి అని కోరడంతో.. ఆ షాప్ యజమాని ఒక్కసారిగా కరిగిపోయాడు. భార్య మీద ఆ వృద్ధుడికి ఉన్న ప్రేమను చూసి చలించి పోయాడు. మాంగల్యం అందించాడు. కేవలం 20 రూపాయలు మాత్రమే తీసుకొని.. వారి కళ్ళల్లో ఆనందం చూశాడు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు. కాకపోతే ఆ ఇద్దరు దంపతుల వ్యవహార శైలిని బట్టి చూస్తే.. అది బెంగాల్ రాష్ట్రం అని తెలుస్తోంది. ” నేటి కాలంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండడం లేదు. గొప్పగా చెప్పుకునే ప్రేమ ఉండడం లేదు. ఏదో ఆర్టిఫిషియల్ జీవితాలు అయిపోయాయి. అలాంటివారికి ఈ దంపతులు ఆదర్శం.. వీరిని చూసి చాలా నేర్చుకోవాలి. వీరి గురించి ఈ తరం దంపతులు చెప్పుకోవాలి. అప్పుడే ఏ బంధమైనా సరే విడాకుల దాకా వెళ్ళదని” నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇలాంటివారు పదికాలాలపాటు చల్లగా ఉండాలని నెటిజన్లు కోరుతున్నారు.
Also Read: లింగయ్య మృతికి జగన్ కాన్వాయ్ కు సంబంధం లేదట..
View this post on Instagram