
England vs New Zealand: క్రికెట్ లో ఒకసారి ఫలించిన స్ట్రాటజీ ప్రతీసారి వర్కౌట్ అవుతుంది అనుకుంటే పెద్ద పొరపాటే.ఎందుకంటే ఆ స్ట్రాటజీ ని అర్థం చేసుకున్న ప్రత్యర్థులు తదుపరి మ్యాచులలో ఓడించడం చాలా తేలిక అవుతుంది.అందుకే ఎప్పటికప్పుడు స్ట్రాటజీలను మారుస్తూ ప్రత్యర్థులను తికమక పెడుతూ ఆడాలి.అప్పుడే గెలవగలం, అలా తన స్ట్రాటజీ ని గుడ్డిగా ఫాలో అయ్యి ఇంగ్లాండ్ జట్టు ఓటమి పాలయ్యేలా చేసాడు బెన్ స్టోక్స్.
చాలా ఉత్కంఠ మధ్య న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ కేవలం ఒకేఒక్క పరుగు తో ఓడిపోవాల్సి వచ్చింది.మరోపక్క న్యూజిలాండ్ జట్టు టెస్ట్ మ్యాచ్ లో ఫాలో ఆన్ ఆడి అద్భుతమైన విజయాన్ని అందుకున్న మూడవ జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది.గతం లో రెండు సార్లు ఇంగ్లాండ్ ఇలాగే ఆడి గెలిచింది, తర్వాత మన టీం ఇండియా ఆ ఘనతని దక్కించుకుంది.ఈ రెండు జట్ల తర్వాత ఫాలో ఆన్ మ్యాచ్ ఆడి గెలిచిన మరో జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది.
అయితే ఈ ఆట ఇంగ్లాండ్ ఓడిపోవడానికి కారణం కెప్టెన్ బెన్ స్టోక్స్ ఉపయోగించిన బజ్ బాల స్ట్రాటజీ అని అంటున్నారు విశ్లేషకులు.’బజ్ బాల్’ అనగా అగ్రెస్సివ్ బ్యాటింగ్ అన్నమాట,టెస్ట్ మ్యాచ్ లో అగ్రెసివ్ గా ఆడడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం.అలా ఆడడం వల్ల టీం డేంజర్ లో పడే అవకాశం ఉంటుంది.కానీ ఇంగ్లాండ్ టీం కి కెప్టెన్ అయినా తర్వాత బెన్ స్టోక్స్ ఈ స్ట్రాటజీ ని ఉపయోగించి 10 టెస్టు మ్యాచులను గెలిచాడు.

ప్రస్తుతం న్యూజిలాండ్ లో జరిగిన రెండు టెస్టు మ్యాచులలో అదే స్ట్రాటెజిని ఉపయోగించారు.మొదటి టెస్ట్ మ్యాచ్ లో గెలిచారు కానీ, రెండవ టెస్ట్ మ్యాచ్ మాత్రం ఓడిపోయారు.అంటే దీని అర్థం ఈ స్ట్రాటజీ ని ప్రత్యర్థులు బాగా స్టడీ చేసారు అన్నమాట.ఒకసారి దెబ్బ తగిలిన తర్వాత కూడా బెన్ స్టోక్స్ అదే ఐడియా తో ముందుకు పోతాడా, లేదా సరికొత్త స్ట్రాటజీ తో మన ముందుకి వస్తాడా అనేది చూడాలి.