https://oktelugu.com/

కెవ్వు కార్తీక్ దాడి వెనుక కథ !

జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ పై దాడి కేసు నమోదు అవ్వడం, పైగా అదీ సోదరి భర్తనే అతని పై ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. మహబూబాబాద్ జిల్లా భూపతిపేటలో తన సోదరి భర్త మీద కార్తీక్ స్నేహితులతో కలిసి దాడిచేశాడు. ఈ దాడి గురించి చెబుతూ.. తన బావమరిది కార్తీక్ వెంట ఐదుగురు ప్రైవేటు వ్యక్తులు వచ్చి దాడి చేసినట్లు పోలీసులకు బాధితుడు రవికుమార్ ఫిర్యాదు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 7, 2020 / 06:38 PM IST
    Follow us on


    జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ పై దాడి కేసు నమోదు అవ్వడం, పైగా అదీ సోదరి భర్తనే అతని పై ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. మహబూబాబాద్ జిల్లా భూపతిపేటలో తన సోదరి భర్త మీద కార్తీక్ స్నేహితులతో కలిసి దాడిచేశాడు. ఈ దాడి గురించి చెబుతూ.. తన బావమరిది కార్తీక్ వెంట ఐదుగురు ప్రైవేటు వ్యక్తులు వచ్చి దాడి చేసినట్లు పోలీసులకు బాధితుడు రవికుమార్ ఫిర్యాదు చేసుకున్నాడు.

    Also Read: సీత గురించి రాజమౌళితో ఆలియా ముచ్చట్లు !

    ఆ ఫిర్యాదులో అతను ముఖ్యంగా పేర్కొన్న ప్రధాన అంశం.. తనను కిడ్నాప్ చేసి, సుమారు పదిహేను కిలో మీటర్లు దూరం కారులో తీసుకెళ్ళి కార్తీక్ కొట్టించాడని అతను చెబుతున్నాడు. ఈ క్రమంలో కార్తీక్‌తో పాటు అతని తల్లిదండ్రులు, వెంట వచ్చిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు గూడూరు పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై సురేష్‌ నాయక్‌ తెలిపారు. అయితే సొంత బావ పైనే కార్తీక్ ఎందుకు ఇలా దాడి చేశాడు.

    Also Read: బిగ్ బాస్ చరిత్రలోనే ఇదే తొలిసారి.. అవినాష్‌ రికార్డు !

    దీని వెనుక కుటుంబ సమస్యలు ఉన్నాయట. తన సోదరిని తన బావ ఇబ్బందులకు గురి చేస్తున్నాడనే.. కార్తీక్, బావ పై ఇలా దాడి చేయించాడని తెలుస్తోంది. తన సోదరిని బాధ పెట్టినందు వల్లే బావను కొట్టినట్లు కార్తీక్ తన సన్నిహితులు దగ్గర చెబుతున్నాడు. ఇక కార్తీక్‌ ఇటీవల సుమ హోస్ట్ గా ప్రసారమయ్యే `క్యాష్` షోలో తన తల్లి వ్యధ చెప్పి ఎమోషనల్ అయ్యాడు. తన తల్లి ఆరోగ్యం బాగోలేక, మూడు సర్జరీలు చేయించుకొని అతి కష్టం మీద బ్రతుకుతుందని, ఆమె కోసమే తాను ప్రతి పైసా కష్టపడి సంపాదిస్తున్న అంటూ చెప్పి అందరిని భావోద్వేగానికి గురి చేశాడు. దీన్ని బట్టి కార్తీక్ ఎమోషనల్ పర్సన్.. వ్యక్తిగతంగా అతను మంచివాడు అని తెలుస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్