https://oktelugu.com/

పీసీసీ రేసులో జగ్గూ భాయ్ ఆగయా?

తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం కోసం ఏమాత్రం చొరవ చూపని.. ఆలోచించని నేతలందరూ ఇప్పుడు తెలంగాణ పీసీసీ చీఫ్ పీఠం ఖాళీ అయ్యే సరికి మాత్రం తామంటే తాము అని కొట్టుకుంటున్న వైనం కాంగ్రెస్ వాదులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే పీసీసీ రేసులో తాను ముందు ఉన్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. తాజాగా శ్రీధర్ బాబు పేరు బయటకు వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి అందరికంటే ముందున్నాడు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 7, 2020 7:30 pm
    Follow us on

    Jagga Reddy

    తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం కోసం ఏమాత్రం చొరవ చూపని.. ఆలోచించని నేతలందరూ ఇప్పుడు తెలంగాణ పీసీసీ చీఫ్ పీఠం ఖాళీ అయ్యే సరికి మాత్రం తామంటే తాము అని కొట్టుకుంటున్న వైనం కాంగ్రెస్ వాదులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే పీసీసీ రేసులో తాను ముందు ఉన్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. తాజాగా శ్రీధర్ బాబు పేరు బయటకు వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి అందరికంటే ముందున్నాడు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి కూడా తెరపైకి వచ్చాడు.

    Also Read: బీజేపీలోకి రాములమ్మతోపాటు ఆమె కూడా చేరారు? గుర్తుపట్టారా..!

    తాజాగా జగ్గూ భాయ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో తాను ఉన్నట్లు  ప్రకటించాడు. కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా ఐక్యత మాత్రం దెబ్బతినదని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే మెడిసిన్ తన దగ్గర ఉందని చెప్పుకొచ్చాడు. డబ్బులు ఉన్నవారికే పీసీసీ చీఫ్ పదవి ఇస్తారన్నది తప్పుడు అభిప్రాయమని కొట్టిపారేశారు.

    Also Read: వరదసాయం కోసం రావద్దంటున్న జీహెచ్ఎంసీ కమిషనర్.. అసలు విషయమెంటీ?

    ఇక బీజేపీ తెచ్చిన వ్యవసాయ చట్టాలపై పోరుబాటకు జగ్గారెడ్డి శ్రీకారం చుట్టారు. పీసీసీ పీఠం దక్కాలంటే ప్రజల్లోకి వెళ్లాల్సి రావడంతో సడెన్ గా జగ్గారెడ్డి రేపు ముంబై హైవేను దిగ్బంధించి రైతులతో కలిసి ఆందోళన చేయనున్నట్లు ప్రకటించాడు. తాను సంగారెడ్డిలో రోడ్డుపై కూర్చుంటానని తెలిపారు.  కేంద్రం కార్పొరేట్ కు కొమ్ము కాస్తోందని జగ్గారెడ్డి విమర్శించారు. రైతులను నాశనం చేసే వ్యవసాయ చట్టాలను కేంద్రం తెచ్చిందని జగ్గారెడ్డి విమర్శించారు. అంబానీ, అదానీ, అమెజాన్ కు లాభం చేయడానికే కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చారని ఆరోపించారు. ఈ చట్టం వల్ల రైతులు లేకుండా పోతారని మండిపడ్డారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    ఇలా పీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ నేతలు అటు లాబీయింగ్ చేస్తూ ఇటు ప్రజల్లోకి వెళుతూ అధిష్టానం కంట్లో పడడానికి నానా యాతన పడుతున్నారు. ఇది ఏమేరకు వర్కవుట్ అవుతుందనేది వేచిచూడాలి.