Beauty Pageants Woman Tearful Story: ముమ్మాటికి ఆ భావన తప్పు. అనుకునే విధానం మరింత తప్పు. ఒక సమస్యను బలంగా చాటి చెప్పాలి అంటే.. సమాజం దృష్టికి తీసుకురావాలి అంటే కచ్చితంగా ఒక బలమైన వేదిక అవసరం. అలాంటి వేదిక మిస్ వరల్డ్ పోటీలు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మిస్ వరల్డ్ పోటీలకు వేదికగా మారింది. కొద్దిరోజుల నుంచి ప్రచారం కూడా భారీగానే చేస్తోంది. అయితే ఇందులో ఏర్పాట్లలో సరైన సమన్వయం లేకపోవడంతో ఇటీవల ఇంగ్లాండ్ కంటెస్టెంట్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. వాటిని కాస్త పక్కన పెడితే.. అందాల పోటీలలో పాల్గొనే సుందరీ మణులు పడుతున్న ఇబ్బందులు.. వారు ఇక్కడదాకా రావడానికి కల్పించిన చాలా భిన్నమైనవి.. వారు తమ ఎదుర్కొన్న కష్టాలు.. పడిన బాధలు చెబుతుంటే హృదయం ద్రవించిపోతుంది..
అందాల పోటీలకు వచ్చిన ఓ వనిత చెప్పిన తన కథ నిజంగా బాధేసింది. ఆటవిక ఆచారాల నుంచి తనను తాను కాపాడుకుంది. ఉన్నంత ధైర్యంతో.. మూడాచారాలపై ఎడతెగని పోరాటం చేస్తోంది. దీనిపై ఆమెకు అనేక బెదిరింపులు ఎదురయ్యాయి. చంపేస్తామనే హెచ్చరికలు కూడా వచ్చాయి. అయినప్పటికీ ఆమె వాటిని ధైర్యంగా ఎదుర్కొంది. తన సమస్యను ప్రపంచం ముందు గట్టిగా చెప్పాలని నిర్ణయించుకుంది. అందువల్లే అందాల పోటీలను ఒక వేదికలాగా భావించింది. ఆ వేదిక మీద దాని ఎదుర్కొంటున్న సమస్యను బలంగా చెప్పగలిగింది. అందువల్లే ఆమె ఇక్కడదాకా రాగలిగింది. తనలాంటి అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలను బయటకి వివరించగలిగింది.
నిండా 17 సంవత్సరాల వయసు కూడా లేని సందర్భంలో ఓ యువతి అత్యాచారానికి గురైంది. ఆ బాధ నుంచి బయటపడిన తను.. తన దేశంలో జరుగుతున్న ఈ దారుణాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తోంది.
ఇక చిన్న వయసులోనే లైంగిక వేధింపుల బారిన పడింది. ఆమెకు కాస్త మెచ్యూరిటీ వచ్చిన తర్వాత.. మనదేశంలో ఇలాంటివన్నీ సర్వసాధారణమే అని తెలిసిపోయింది. అటువంటి వాటికి వ్యతిరేకంగా ఏకంగా ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ప్రజలలో చైతన్యం తీసుకొస్తోంది.
Also Read: TDP Party : పుంగనూరులో సిక్కోలు టిడిపి కార్యకర్తల సైకిల్ యాత్ర.. పెద్దిరెడ్డి కి షాక్!
ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరిది ఒక్కో బాధ. తెలంగాణ ప్రభుత్వం సరిగా ఏర్పాటు చేయలేకపోవచ్చు. ఇందులో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురు కావచ్చు. ప్రభుత్వపరంగా కొన్ని విషయాలలో అడ్డగోలుతనం ఉండొచ్చు. కానీ అంతిమంగా సొసైటీ బాగుకోసం ఈ అతివలు ఎంచుకున్న మార్గం మాత్రం అద్భుతం. దీనికి ఎలాంటి పేరు పెట్టినా పెద్ద ఇబ్బంది లేదు. కాకపోతే అందాల పోటీలు అంటే ఒక భావన ఏర్పడిన మన సమాజం.. ఇలాంటి వాటిని ఓన్ చేసుకోవడం కొంచెం కష్టమే.