
BB Jodi: బుల్లితెర ప్రొగ్రామ్స్ రోజు రోజుకు వేడిని పెంచుతున్నాయి. కామెడీ స్కిట్స్ పేరిట కొందరు రెచ్చిపోతున్నారు. ముద్దంటే చేదా? అన్న స్థితి నుంచి లిప్ లాక్ వరకు వెళ్తుండడంతో ఇంట్లో కుటుంబ సభ్యులు చూసే పరిస్థితి లేకుండా పోతుందన్న వాదన వినిపిస్తోంది. అయితే కుర్రాళ్లను అకట్టుకునే విధంగా కొందరు యాక్టర్స్ కెమెరా ముందే రొమాన్స్ ను పండిస్తున్నారు. ఒకరి లిప్ ను మరొకరు అందుకునేందుకు ట్రై చేస్తూ కాక పుట్టిస్తున్నారు. లేటేస్టుగా ఇన్ స్ట్రాగ్రామ్ వేదికలో ఓ వీడియో కుర్రాళ్ల గుండెల్లో వేడి పుట్టిస్తోంది. చాటుగా చూడాల్సిన వీడియో ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా అందుబాటులో ఉండడంతో దానిని వైరల్ చేసేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో కథేంటీ?
ఈ వీడియోలో సినిమా నటుడు వరుణ్ సందేశ్, మరో అమ్మాయి లిప్ లాక్ చేస్తారు. అయితే అందరికీ అది లిప్ లాక్ చేసినట్లు అనిపించినా డైరెక్ట్ లిప్ లాక్ కాదు. ఓ పండును వారిద్దరు ఇకేసారి తింటారు. ఇలా చివరికి వచ్చిన సమయంలో విడిపోతారు. కానీ అప్పటి వరకు ఇది చూస్తున్న వారికి ఏం జరుగుతోందోనని ఒక్కబట్టి వీడియో చూస్తారు. చివరికీ ఏం కాలేదు అనుకున్న తరువాత ఊపిరి పీల్చుకుంటారు. ఇలా ఇద్దరు ఆ సీన్ చేస్తున్నప్పుడు అక్కడే యాంకర్ రష్మీ ఉన్నారు. వారిద్దరిని చూసి రష్మీ సిగ్గుతో ముహం కప్పేసుకుంటోంది. నటుడు హైపర్ ఆది తో పాటు ఇతరులు షాక్ కు గురయ్యారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతోంది. మొన్నటి వరకు కేవలం హగ్గింగ్ వరకే ఉన్న రొమాన్స్ ఇప్పుడు లిప్ లాక్ వరకు వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే హాట్ సాంగ్స్ పేరిట పలు టీవీ ప్రోగ్రామ్స్ లో రొమాన్స్ షో చేస్తూ హంగామా చేస్తున్నారు. దీంతో సినిమాలు చూసే యూత్ ఎక్కువగా టీడీ ప్రోగ్రామ్స్ చూసేందుకు ఇంట్రెస్ట్ పెడుతున్నారు. వారి ఇంట్రెస్ట్ కు అనుగుణంగా ఇలా లిప్ లాక్ వరకు రెచ్చిపోతుండడంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.