
Ram Gopal Varma: నలుగురు ఒకవైపు ఉంటే.. రాంగోపాల్ వర్మ మరో వైపు ఉంటారు.. అందుకే ఆయన చేసే కామెంట్లు ప్రత్యేకంగా ఉంటాయి. ఆర్జీవీ చేసేవన్నీ వివాదాస్పద కామెంట్సే అయినా తన మనసులో నుంచి వచ్చిన వ్యాఖ్యలు అంటూ సంచలనంగా మారతున్నారు. తాజాగా ఈ సీనియర్ డైరెక్టర్ బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లోకెక్కాడు. అయితే ఎప్పుడూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చే ఆర్జీవీ ఈసారి ఏకంగా చదువుకునే విద్యార్థులకు కొన్ని పాఠాలు చేయడం వివాదస్పదంగా మారింది. ప్రపంచంలో కష్టపడడం ద్వారా సక్సెస్ వస్తుందని అనుకోవడం వేస్ట్ అని.. సెక్స్, ఫుడ్ రెండే ముఖ్యమని అర్థం వచ్చే లా ఆయన చేసిన కామెంట్స్ రచ్చ రచ్చయ్యాయి.
ఏపీలోని నాగార్జున యూనివర్సిటీ అకడమిక్ ఎగ్జిబిషన్ -2023 సందర్భంగా రాంపాల్ వర్మ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు కొన్ని సూచలను అందించారు. సాధారణంగా ఎవరైనా విద్యార్థులకు తాము జీవితంలో పడ్డ కష్టాల గురించి, లేదా భవిష్యత్ లో ఇలా ఉండాలి.. అలా ఉండాలి.. అని చెబుతారు. కష్టపడి పైకి రావాలని చక్కటి జీవితాన్ని అలవర్చుకోవాలని హితబోద చేస్తారు. కానీ ఆర్జీవి అలా చెబితే వెరైటీ ఏముంటుంది? అనుకున్నాడో?ఏంటో? కాస్త భిన్నమైన వ్యాఖ్యలు చేసి సంచలనంగా మారాడు.
‘చదువుకొని బాగుపడాలి అనే సిద్ధాంతం నా దృష్టిలో వేస్ట్.. ప్రతి ఒక్కరు కష్టపడి పైకి వచ్చారనే సిద్ధాంతాన్ని నేను అస్సలు నమ్మను. స్మార్ట్ వర్క్ చేయడం ద్వారా తొందరగా జీవితంలో పైకి వస్తారు. స్మార్ట్ వర్క్ ను తాను నేర్చుకోవడమే కాదు. ఇతరులకు నేర్పాలి. నేను కాలేజీకి గెస్ట్ గా రావడం వల్ల నన్నెదో క్లెవర్ స్టూడెంట్ అని మీరు అనుకోవద్దు. నేను చదువుకునే రోజుల్లో లాస్ట్ బెంచ్ లో కూర్చునేవాడిని.. కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మాయిలకు లైన్ వేసేవాడిని.

‘జీవితానికి స్వర్గం, నరకం అనే రెండు దారులు ఉంటాయని చాలా మంది చెబుతుంటారు. కానీ అక్కడికి వెళ్లిన తరువాత నరకమే ఉంటే? స్వర్గం లేకపోతే? ఎలా? అందువల్ల ఉన్న జీవితంలో అన్ని అనుభవించండి. చనిపోయిన తరువాత రంభ, ఊర్వశి, మేనకలు ఉంటారని అస్సలు భ్రమపడొద్దు. మనిషిగా జీవించినప్పుడే సెక్స్ లో ఎంజాయ్ చేయండి.. తినండి.. తాగండి.. మొత్తంగా సంతోషంగా జీవించండి..’ అంటూ ఆర్జీవి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ట్విట్టర్ ఖాతాలో ఆర్జీవి ఇలాంటి కామెంట్స్ చేస్తే ఎవరూ పట్టించుకోరు కావొచ్చు. కానీ భవిష్యత్ ను నిర్ణయించే కళాశాలలో ఆర్జీవి బహిరంగంగా ఇలా మాట్లాడడంపై అందరూ ఆశ్చర్యపోయారు. విద్యార్థులకు చెప్పాల్సిన విషయాలు ఇవేనా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆర్జీవి మాట్లాడుతున్న సందర్భంలో స్టూడెంట్ష్ కేరింతలు కొడుతూ రెచ్చిపోయారు. అటు నెట్టింట ఆర్జీవి కామెంట్ష్ వైరల్ కావడం నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.