
Himaja: ముంబై మోడల్స్ మోజులోపడి అచ్చ తెలుగు అమ్మాయిలను ఇండస్ట్రీ లో తోక్కేస్తున్నారు అంటూ ఎప్పటి నుండో ఒక వాదన ఉంది. కొంతమంది దీనిపై ఉద్యమం చేసారు కూడా. అందం తో అద్భుతమైన అభినయం ఉన్న ఎంతో మంది తెలుగు అమ్మాయిలు అవకాశాలు లేక ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నారు.అలాంటి వారిలో ఒకరు హిమజ.
బుల్లితెర లో ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ మరియు ‘స్వయంవరం’ వంటి సీరియల్స్ లో హీరోయిన్ గా నటించి మంచి పాపులారిటీ ని తెచ్చుకున్న హిమజ, ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.అంతే కాదు ఈమె ‘శతమానం భవతి’, ‘ధ్రువ’, ‘నేను శైలజ’ , ‘స్పైడర్’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’, ‘వినయ విధేయ రామ’, ‘చిత్రలహరి’ ,మరియు ‘వరుడు కావలెను’ వంటి ఎన్నో చిత్రాలలో ముఖ్య పాత్రలు పోషించింది కానీ, మెయిన్ హీరోయిన్ గా చేసే అవకాశం మాత్రం రాలేదు.

అయితే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఇండస్ట్రీ లో అవకాశాల కోసం ప్రారంభం లో ఎన్ని ఇబ్బందులను మరియు కష్టాలను ఎదురుకోవాల్సి వచ్చిందో చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ‘ఇండస్ట్రీ లో అవకాశాలు రావడం అంత తేలికేమి కాదు, కాస్టింగ్ కౌచ్ వంటి అనుభవాలు నాకు ఎదురు అవ్వలేదు కానీ, అవమానాలు మాత్రం బాగానే పడ్డాను. మొదట్లో నా కళ్ళు అసలు బాగాలేవు అనేవాళ్ళు. కెమెరా కి నీ ముఖం పనికిరాదు అని కూడా అనేవాళ్ళు. కానీ మేకప్ వేసిన తర్వాత నా ముఖం చూస్తే కళ్ళనే ప్రత్యేకంగా మెచ్చుకునే వాళ్ళు. ఆ తర్వాత నా నడక మగాడిలా ఉంటుంది అని వెక్కిరించేవారు. వాళ్ళు అన్నారని కాదు కానీ, నిజంగానే నా నడక మగవాడి లెక్కనే ఉంటుంది. మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది హిమజ. 2021 వ సంవత్సరం వరకు ఫుల్ బిజీ గా హిమజ ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది.