https://oktelugu.com/

Barrelakka: పెళ్లిపీటలు ఎక్కబోతున్న బర్రెలక్క.. వరుడు ఎవరో తెలుసా?

కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన బర్రెలక్క గెలిచిందా ఓడిందా అనేది పక్కన పెడితే ఓ బిందువులా మొదలై సింధువుగా మారిన ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 23, 2024 / 08:27 AM IST

    Barrelakka

    Follow us on

    Barrelakka: బర్రెలక్క.. ఇది ఒక పేరు మాత్రమే కాదు.. ఒక బ్రాండ్‌. ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌తో మొత్తం తెలంగాణనే ఒక ఊపు ఊపేసింది. బర్రెలు కాస్తూ ఆమె చేసిన వీడియో తన జీవితాన్నే మార్చేసింది. వైరల్‌ అయిన ఆ వీడియోతో జనాలు పిలిచిన పేరునే తన పేరుగా మార్చుకుంది. ఇప్పుడు ఓ సెలబ్రిటీ అయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్రంలోనే ఓ సంచలనం సృష్టించింది. నిరుద్యోగుల కోసమే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని నిరుద్యోగ లోకానికి ఉత్తేజాన్ని ఇచ్చింది. రీల్స్, షార్ట్స్‌ చూస్తూ టైంపాస్‌ చేసే యువతను ఆలోచింపజేసింది. సోషల్‌ మీడియా, మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాను కూడా తనవైపు తిప్పుకుంది. మేధావుల మద్దతు కూడా సంపాదించుకుంది.

    ఓడినా గుర్తుండిపోయింది..
    కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన బర్రెలక్క గెలిచిందా ఓడిందా అనేది పక్కన పెడితే ఓ బిందువులా మొదలై సింధువుగా మారిన ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది.
    ఎన్నికల తర్వాత బిగ్‌బాస్‌–7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌తో పెళ్లి అని వార్తలు వైరల్‌ అయ్యాయి. దీనిపై స్పందించిన బర్రెలక్క అలాంటిదేమీ లేదని తెలిపింది. ఇప్పుడు ఇప్పుడు ఆమెనే స్వయంగా తన పెళ్లి గురించి ప్రకటించింది. పెళ్లి చూపుల నుంచి మొదలు పెట్టి అన్ని ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో అప్‌డేట్‌ చేస్తోంది.

    పేదింటి నుంచి వచ్చి..
    మహబూబ్‌నగర్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్‌ గ్రామానికి చెందిన ఒక నిరుపేద అమ్మాయి.. శిరీష. ఎలాంటి సపోర్ట్‌ లేకుండా.. తాను దిగుతున్న రంగం ఎంతలోతు ఉంటుంది, ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, నెగ్గుకురాగలనా? లేదా? అని ఆలోచిస్తూ కూర్చోకుండా.. కేవలం తన ఆత్మస్థైర్యాన్ని మాత్రమే నమ్ముకొని గుండెధైర్యంతో ముందడుగేసి.. ఎన్నో మెదళ్లను కదిలించింది బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష.

    పెళ్లి పీటలు ఎక్కనున్న శిరీష..
    తెలంగాణ రాజకీయాల్లోనే కాదు పక్కన్న ఉన్న ఏపీలోనూ దుమారం రేపిన బర్రెలక్క ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. తన ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ ఛానెల్‌లో ఈమేరకు చెప్పుకొచ్చింది. పెళ్లి చూపుల నుంచి మొదలు పూలు పండ్లు, షాపింగ్, మేకప్, బ్యాచ్‌లర్‌ పార్టీ, ఇలా అన్ని వీడియోలూ పోస్టు చేస్తూ తన అభిమానులు, ఫాలోవర్స్, శ్రేయోభిలాషులకు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ ఇస్తుంది.

    వరుడు ఎవరంటే..
    ఇక బర్రెలక్క చేసుకోబోయే వరుడు ఎవరని చాలా మంది సోషల్‌ మీడియా వేదికగానే ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై మాత్రం సస్పెన్స్‌ కొనసాగిస్తోంది బర్రెలక్క. తనకు దూరపు బంధువు అని, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ చాలా మద్దతుగా నిలిచాడని మాత్రం హింట్‌ ఇచ్చింది. ఇక పెళ్లి ఎప్పుడంటే మార్చి 28న. అదే రోజు వరుడిని పరిచయం చేస్తానని చెబుతోంది శిరీష.