Donald Trump: ట్రంప్‌ ఆస్తుల స్వాధీనం..

అసెట్స్‌ విలువ గురించి అబద్ధాలు చెప్పి బ్యాంకులు, బీమా సంస్థలను మోసం చేశాడని కోర్టు పేర్కొంది. కేసు ఓడిపోతే కచ్చితంగా పనెనాల్టీ చెల్లించేలా గ్యారంటీని ఇచ్చి తీరాలని తెలిపింది.

Written By: Raj Shekar, Updated On : March 23, 2024 8:38 am

Donald Trump

Follow us on

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు, ఈ ఏడాది జరుగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్స్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఆస్తుల స్వాధీనానికి రంగం సిద్ధమైంది. మోసం కేసులో 355 మిలియన్‌ డాలర్లు, దాడిపై వడ్డీ చెల్లించాలని న్యూయార్క్‌ కోర్టు తీర్పు చెప్పింది. ట్రంప్‌తోపాటు అతని కుమారులు, ట్రంప్‌ ఆర్గనైజేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 454 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని లెక్క తేల్చింది.

చెల్లింపులపై నిర్లక్ష్యం..
జరిమానా చెల్లింపును ట్రంప్‌ పెద్దగా పట్టించుకోలేదు. కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ ట్రంప్‌ ఆస్తుల స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. మన్‌ హట్టన్‌లోని ట్రంప్‌ ప్రైవేటు ఎస్టేట్, సెవన్‌ ప్ప్రింగ్స్, గోల్ఫ్‌ కోర్టు స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టింది.

బ్యాంకులను మోసం చేశాడని..
అసెట్స్‌ విలువ గురించి అబద్ధాలు చెప్పి బ్యాంకులు, బీమా సంస్థలను మోసం చేశాడని కోర్టు పేర్కొంది. కేసు ఓడిపోతే కచ్చితంగా పనెనాల్టీ చెల్లించేలా గ్యారంటీని ఇచ్చి తీరాలని తెలిపింది. దానిని రాజ్యాంగ విరుద్ధమని ట్రంప్‌ పేర్కొన్నాడు. ఇప్పటికే పలు కేసుల్లో ట్రంప్‌పై కేసులు నమోదయ్యాయి.

ఇటీవల మరికొన్ని..
ఇదిలా ఉండగా, ఇటీవల ట్రంప్‌పై లైంగిక వేదింపులకు సంబంధించిన పరువు నష్టం కేసులో అమెరికన్‌ మాజీ కాలమిస్ట్‌ జీన్‌ కరోల్‌కు 83.3 మిలియన్‌ డాలర్లు అదనంగా చెల్లించాలని మాన్‌ హటన్‌ ఫెడరల్‌ కోర్టు ఆదేవించింది. ఇదే కేసులో అంతకు ముందు ట్రంప్‌కు 5 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది.