Bank Holidays: బ్యాంకులు ఐదు రోజుల పాటు మూతపడనున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు రావడంతో వరుసగా మరో నాలుగు రోజులు వీవులు కావడంతో వారంలో ఐు రోజులు బ్యాంకులు పనిచేయవు. 28 నాలుగో శనివారం, 29 ఆదివారం, 30, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె చేస్తుండటంతో ఐదు రోజులు బ్యాంకు సేవలు స్తంభించనున్నాయి. పెన్షన్ అప్డేషన్, నేషనల్ పెన్షన్ స్కీం రద్దు, జీతాల పెంపు, ఖాళీల భర్తీ డిమాండ్లతో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్ సమ్మె చేస్తుండటంతో ఐదు రోజులు సెలవులు వచ్చాయి.

27న మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. 26,28,29 తేదీల్లో బ్యాంకులు తెరుచుకోవు. బ్యాంకుల్లో పని ఉన్న వారు ఎదురు చూడక తప్పదు. వరుసగా సెలవులు రావడంతో అత్యవసర పనులు ఉన్న వారికి నష్టమే. బ్యాంకు వినియోగదారులు ఐదు రోజుల పాటు ఏ పనులు చేయడానికి వీలు లేదు. ఏకంగా ఐదు రోజులు సెలవులు రావడంతో ఈఎంఐలు కట్టే వారికి ఇబ్బందులే రానున్నాయి. నెలాఖరు కావడంతో చాలా మంది తమ రుణ వాయిదాలు చెల్లించేందుకు వెసులుబాటు లేకుండా పోయింది.
గణతంత్ర దినోత్సవం గురువారం రావడంతో నాలుగో శనివారం, ఆదివారం సెలవులుగా వచ్చాయి. ఇక 30, 31 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టడంతో ఐదు రోజులు విరామం వచ్చింది. బ్యాంకులకు వరసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో జనవరి నెలలో మిగిలిన 8 రోజుల్లో ఐదు రోజులు పనిచేయకుండా పోవడంతో వినియోగదారులు అయోమయంలో పడ్డారు. బ్యాంకు పనిదినాల తగ్గింపు, సిబ్బందిపై ఒత్తిడి తగ్గించడానికి నియమాలు తీసుకోవాలనే డిమాండ్లతో సమ్మె చేపట్టనున్నాయి.

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేసన్ (ఐబీఏ) నుంచి తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలని చూస్తున్నాయి. ఇందుకోసమే సమ్మె బాట పడుతున్నారు. అందుకే 30,31 తేదీల్లో సమ్మె చేయాలని భావించాయి. ఈ మేరకు డిమాండ్ నోటీసు కూడా ఇచ్చాయి. బ్యాంకుల్లో పనులు ఉన్న వారు సెలవులను గుర్తుంచుకుని తమ కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏటీఎం లావాదేవీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడం వీలు పడదు.