Ram Charan- Director Shankar: దర్శకుడు శంకర్ కి ప్రాంతీయ అభిమానం ఎక్కువ. ఆయన ఇతర పరిశ్రమల హీరోలతో మూవీ చేయడానికి ఆసక్తి చూపరు. ఒకప్పుడు ఆయన డైరెక్షన్ లో మూవీ చేయడం చాలా మంది హీరోల డ్రీమ్ గా ఉండేది. రాజమౌళి కన్నా ముందే పాన్ ఇండియా హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ ఆయన. ఇండియన్ సినిమాకు భారీతనం నేర్పిన డైరెక్టర్ శంకర్. సమాజంలో వేళ్ళూనుకుపోయిన అవినీతి, వ్యవస్థల్లోని లోపాలను శంకర్ తన సినిమాలతో ప్రశ్నించారు. జనాల్లో చైతన్యం తెచ్చారు. సామాజిక కోణాలకు కమర్షియల్ హంగులు అద్ది తెరకెక్కించడంలో ఆయన దిట్ట. ఆ కారణంగా ఎక్కువ మంది జనాలకు రీచ్ అయ్యాయి.

శంకర్ సినిమాలు సృష్టించిన సంచలనాలు తెలియాలంటే ఓ ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్లాలి. మూడు దశాబ్దాల కెరీర్లో శంకర్ బయట హీరోతో ఒకే ఒక మూవీ చేశారు. అనిల్ కపూర్ తో ఒకే ఒక్కడు రీమేక్ హిందీలో చేశారు. ఫస్ట్ టైం టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తో మూవీ చేస్తున్నారు. శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్ కి ఉన్న ప్రత్యేకతల్లో ఇది కూడా ఒకటి. శంకర్ రామ్ చరణ్ రెండు భిన్నమైన రోల్స్ చూపిస్తున్నారు. ఇది కూడా శంకర్ మార్క్ సోషల్ సబ్జెక్ట్. పొలిటికల్ థ్రిల్లర్ కూడాను.
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో రామ్ చరణ్ యంగ్ పొలిటీషియన్ గా కనిపిస్తారు. ఆయన నాయకుడా? కార్యకర్తా? అనేది సస్పెన్స్. పీరియాడిక్ రోల్ కి సంబంధించిన రామ్ చరణ్ లుక్ లీకైంది. ఈ పాత్రకు జంటగా అంజలి నటిస్తున్నారు. ఇక మోడ్రన్ లుక్ రివీల్ కాలేదు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సూట్ ధరించి గవర్నమెంట్ అధికారికంగా రామ్ చరణ్ ని ప్రజెంట్ చేశారు. హీరోయిన్ కియారా అద్వానీ, సునీల్ సైతం అదే గెటప్స్ లో కనిపించడం విశేషం.
ఈ రెండు కాలాలకు, పాత్రలకు ఉన్న సంబంధం ఏమిటీ? అనేది ఇంట్రెస్టింగ్ ట్విస్ట్. శంకర్ చిత్రాల్లో చెప్పుకోవలసిన మరొక అంశం సాంగ్స్. దర్శకుడు శంకర్ సాంగ్స్ మేకింగ్లో మాస్టర్. బహుశా ప్రపంచంలో శంకర్ ఒక సాంగ్ ని తెరకెక్కించినంత గ్రాండ్ గా, అందంగా తెరకెక్కించే దర్శకుడు మరొకరు ఉండరేమో. సాంగ్స్ కోసమే ఆయన కోట్లు ఖర్చు పెడతారు. బెస్ట్ డాన్సర్ అయిన రామ్ చరణ్ పై శంకర్ రూపొందించే సాంగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తలచుకుంటేనే మనసు పులకిస్తుంది.

దిల్ రాజు భారీ బడ్జెట్ తో శంకర్-రామ్ చరణ్ మూవీ తెరకెక్కిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. శంకర్ అనుకోకుండా భారతీయుడు 2 షూట్ సైతం పూర్తి చేయాల్సి వచ్చింది. దాంతో ఆర్సీ 15 షూట్ ఆలస్యం అవుతుంది.