Bangladesh Woman Love Story: ప్రేమకు హద్దులు లేవు. కులం మతం చూడదు. తారతమ్యాలు ఉండవు. ఎక్కడైనా పుట్టవచ్చు. ఎవరి మధ్య అయినా పుట్టవచ్చు అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పటికే అమెరికా అబ్బాయి తెలంగాణ అమ్మాయి, ఆస్ట్రేలియా అమ్మాయి ఆంధ్రా అబ్బాయి ఇలా ఎంతో మంది దేశాలు దాటి కూడా పెళ్లి చేసుకున్నారు. విమానంలో వచ్చి పెళ్లి చేసుకొని వధువును తీసుకొని వెళ్లారు. ఇలాంటి మరో స్టోరీని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఒక ఇన్ స్టాగ్రామ్ మరో ఇద్దరిని కలిపింది. అది కూడా వేరే దేశాల ఇద్దరిని కలిపింది. ఈ స్టోరీ తెలిస్తే కాస్త ఆశ్చర్యపోతారు. మరి ఏంటో ఆ ప్రేమ కథ ఓ సారి లుక్ వేయండి.
Also Read: కోటాను చూసి వెక్కి వెక్కి ఏడ్చిన బ్రహ్మానందం… వీడియో వైరల్
ఓ బంగ్లాదేశ్ మహిళ తన ప్రేమ కోసం తన దేశం దాటి వచ్చింది. కానీ ఏకంగా త్రిపుర జైలకు చేరింది. దాదాపు 8 నెలల క్రితం ఒక బంగ్లాదేశ్ మహిళ, ఇండియా అబ్బాయిని ప్రేమించింది. అది కూడా ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడిన తర్వాత అని సమాచారం. ఈ 8 నెలల్లోనే వారి పరిచయం ప్రేమగా మారింది. ఇక ప్రేమ కోసం హద్దులు చెరిపేసి తన ప్రేమను చేరుకోవాలని అంతర్జాతీయ సరిహద్దును దాటి వచ్చింది.
మొత్తం మీద అన్ని దాటి ఇండియాను చేరుకుంది. కానీ ఈ మహిళ ఇప్పుడు త్రిపుర జైలులో ఉంది. ప్రేమికుడిని కలవడానికి వచ్చిన ఈ మహిళ పేరు గుల్షాన్ అక్తర్. ఈమె బంగ్లాదేశ్ లోని బోగురా జిల్లాలోని పల్సా గ్రామంలో నివసించేది. ఇక ఈమె ప్రేమించిన వ్యక్తి దత్తా యాదవ్. కర్ణాటకకు చెందినవాడు. వీరిద్దరూ సోషల్ మీడియాలో పరిచయం. కాలం గడుస్తున్న కొద్దీ వారి బంధం బలపడింది. చాలా సేపు మాట్లాడుకునే వారు. అలా ఒకసారి చూడాలి. కలవాలి అనిపించి దేశం దాటింది. కానీ పోలీసులు పట్టుకొని జైలులో వేశారు.
వీరిద్దరు ఈ నెల 10న త్రిపుర బోర్డర్ వద్ద కలుసుకున్నారు కూడా. దీంతో BSF జవాన్లు వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇక కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ ను విధించింది. హ్యూమన్ ట్రాఫికింగ్ కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. వీరిది నిజమైన ప్రేమనే అనుకుందాం కాసేపు. ప్రస్తుతం ఎంతో మంది భర్తలను చంపడం, లవర్స్ ను చంపడం, కుక్కర్లో వండటం, హనీమూన్ అంటూ మర్డర్స్ చేయడం వంటివి జరుగుతున్న ఇలాంటి కాలంలో తన దేశ హద్దులు దాటి వచ్చిన ఈ అమ్మాయి ప్రేమను కూడా కొనియాడాల్సిందే. కానీ ఇందులో కాస్త సంకోచించాల్సిన అవసరం కూడా ఉంది అంటున్నారు నెటిజన్లు. ఇన్వెస్టిగేషన్ తర్వాత ప్రేమ కోసం వచ్చిందా? లేదా మరేదైనా ఇతర కుట్ర పన్ని వచ్చిందా అనే విషయం తేలుతుంది. చూడాలి వీరు ప్రేమలో మరొక స్టెప్ ఏం జరుగుతుంది అనేది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.