Kannamba Death Mystery: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. కానీ అప్పట్లోనే హీరోలకు పోటీని ఇస్తూ కొంతమంది నటీమణులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న విషయం మనకు తెలియదు. ముఖ్యంగా కన్నాంబ లాంటి నటి తెలుగు సినిమా ఇండస్ట్రీకి వన్నె తీసుకొచ్చారనే చెప్పాలి. నటశిరోమణిగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న ఆమె ఇంత ఎత్తుకు ఎదిగిందో ఆమె జీవితంలో అన్ని కష్టాలను కూడా అనుభవించింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె శవం కూడా దొరకలేదు. ఇప్పటికి ఆమె శరీరం ఏమైంది అనేది ఒక మిస్టరీ అనే చెప్పాలి… కన్నాంబ 1912లో ఏలూరులో పుట్టింది, గుంటూరులో పెరిగింది. అప్పట్లో వాళ్లది చాలా పెద్ద పేరున్న కుటుంబం పెదనాన్న-పెద్దమ్మ, బాబాయిలు – చిన్నమ్మలు, మామయ్యలు- అత్తమ్మలు చాలామంది ఉండేవారు. మొత్తానికైతే తన 17 మంది తోడబుట్టిన వాళ్లలో తను ఒక్కరే అమ్మాయి కావడం విశేషం…
అందుకే ప్రతి ఒక్కరు ఆమెను అల్లారుముద్దుగా పెంచారు. అయితే ఐదో తరగతి వరకు చదువుకున్న కన్నాంబ తన 11 వ ఏట నుంచి వీధి నాటకాల మీద ఎక్కువగా ఆసక్తి చూపించేవారట…ఇక నాటకాల మీద ఉన్న ఇష్టంతో ఆమె సినిమాల్లోకి రావాలని డిసైడ్ అయ్యారు… సినిమా ఇండస్ట్రీకి వెళ్తానని ఇంట్లో చెప్పినప్పుడు మొదట్లో వాళ్ళ అమ్మానాన్న చాలా వరకు వద్దని వారించారట. సినిమా ఇండస్ట్రీ అందరికీ సెట్ అవ్వదని ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారట. అయినప్పటికీ ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టని నైజం కన్నాంబ కి ఉండడం వల్ల ఆమె వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించి ఇండస్ట్రీలో ఏదైనా తప్పు చేసే పరిస్థితి వస్తే నన్ను నేను చంపుకుంటాను అంతే తప్ప నా కెరియర్ లో ఎలాంటి తప్పయితే చేయను…మీ పెంపకానికి ఎలాంటి ముప్పు రానివ్వను అంటూ చెప్పిందట. దాంతో ఆమె మీద ఉన్న నమ్మకంతో ఇంట్లో తల్లిదండ్రులు సైతం అమ్మని సినిమా ఇండస్ట్రీకి వెళ్లడానికి ప్రోత్సహించారు. మొదటగా 1935 వ సంవత్సరంలో ‘హరిశ్చంద్ర ‘ అనే సినిమాలో హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి గా నటించారు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మరి ఏది ఏమైనా కూడా అప్పటినుంచి ఆమె వెనుతిరిగి చూడలేదు. వరుసగా సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగారు… ద్రౌపది వస్త్రాపహరణం, కనకతార, పల్నాటి యుద్ధం, అనార్కలి, దక్షయజ్ఞం లాంటి సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక తను స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత తమిళ స్టార్ హీరో నుంచి కొంతవరకు ఆమెకు ఇబ్బందులు అయితే ఎదురయ్యాయట…
Also Read: Venkatesh And Krishna: సూపర్ స్టార్ కృష్ణ వల్లే వెంకటేష్ హీరో అయ్యాడా..?
ఈరోజుల్లో చాలామంది కాస్టింగ్ కోచ్ పేరుతో దర్శకనిర్మాతలు తమను వేధిస్తున్నారు అంటూ చాలామంది ఓపెన్ గా బయటికి వచ్చి చెబుతున్నారు. ఇక ఇలాంటి సిచువేషన్ ఆ తమిప్ హీరో నుంచి అప్పట్లోనే కన్నాంబకి కూడా ఎదురైందట. కానీ ఆమె ఎక్కడా ఎవరికీ లొంగను, వెనక్కి తగ్గను అంటూ ముందుకు దూసుకెళ్లే నైజం ఉండడంతో ఆ హీరోని పక్కన పెట్టేసి తన పనులు తను చేసుకుంటూ వచ్చేది. కానీ క్రమక్రమంగా ఆమెకు ఇండస్ట్రీలో అవకాశాలను తగ్గించే ప్రయత్నం అయితే ఆ హీరో చేశారట. మొత్తానికైతే కన్నాంబ భర్త అయిన నాగభూషణం సైతం దర్శకుడిగా పలు సినిమాలు చేశాడు. ఇక వీళ్లిద్దరు కలిసి ‘ శ్రీ రాజరాజేశ్వర ఫిలిం’ అనే బ్యానర్ ను స్థాపించి నిర్మాతగా పలు సినిమాలను చేశారు.
ఇక ఈ క్రమంలోనే ఆయన చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ లు సాధించకుండా ఆ తమిళ్ హీరో కొన్ని కుట్రలు పన్నాడట. మరి ఏది ఏమైనా కూడా ఆమె మాత్రం ఆ హీరోకి లొంగకుండా తన సినిమాలు తను చేసుకుంటూ ముందుకు సాగింది. మరి ఇలాంటి క్రమంలోనే కన్నంబ నాగభూషణం ఇద్దరు కూడా మంచి స్వభావం కలిగి ఉండటం తమకు కావాల్సిన వాళ్ళకు వీళ్ళు మధ్యవర్తులుగా ఉండి అప్పులు ఇప్పించడం లాంటివి చేయడం వల్ల వీళ్ళకు కొంతవరకు నష్టమైతే కలిగింది. ఇక దాంతో పాటుగా ఏ హీరో అయితే కన్నాంబ ను లొంగదీసుకోవాలని చూశాడో ఆ హీరోతో రెండు మూడు సినిమాలు చేసినప్పటికి అవి కూడా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదట.
Also Read: Kota Srinivasarao Interview: కోట శ్రీనివాసరావు కి ఇష్టమైన హీరోలు వీళ్లేనా..?
మొత్తానికైతే కన్నాంబ తన ఎంటైర్ జీవితంలో ఒక్కసారి కూడా జ్వరం రాలేదట. కానీ తను అనుకోకుండా 1964 మే 7 వ తేదీన ఎలాంటి అనారోగ్య పరిస్థితులు లేకుండానే ఆమె కన్నుమూశారు…అయితే ఆ తమిళ నటుడు ఆమె మీద బతికున్నప్పుడే కాకుండా చనిపోయిన తర్వాత కూడా రివెంజ్ తీర్చుకున్నాడు అంటూ కన్నాంబ మనవడు అయిన దేవి చౌదరి చెబుతూ ఉంటాడు. అది ఎలా తీర్చుకున్నాడు అంటే ఆమె చనిపోయిన తర్వాత ఆమె శవాన్ని సైతం మాయం చేసి ఆమె మీద ఉన్న బంగారు ఆభరణాల కోసం దొంగలు ఆ శవాన్ని మాయం చేశారని ఒకటి క్రియేట్ చేశారట.
మొత్తానికైతే ఆమె శవం ఎక్కడ మిస్సయింది అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక తన శవాన్ని పూడ్చిపెట్టి సమాధి కట్టిద్దాం అనుకున్న వల్ల కుటుంబానికి ఇలా జరగడంతో కన్నాంబ ఫ్యామిలీ తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యారట… మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న కన్నాంబ కు ఇలాంటి ఘోర పరాభవం జరగడం అనేది నిజంగా చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి… చెప్పాలి…