Bengaluru Businessman: ఎవరి నమ్మకాలు వారికుంటాయి. తాను నమ్మిన దానికి చాలా మంది కట్టుబడి ఉంటారు. తాను నమ్మితే ప్రపంచమే తలకిందులైనా వినిపించుకోరు. తామకున్నది చేస్తారు. అది భక్తి అయినా ఏ విషయం అయినా వారి నమ్మకమే పెట్టుబడి. నమ్మకం అలాంటిది మరి. తాను మొక్కుకున్న మొక్కు కోసం అతడు ఆరు వారాలుగా దేవుడి దర్శనం కోసం వస్తున్నాడు. ఇక ఒక వారమే మిగిలి ఉంది.

బెంగుళూరు
బెంగుళూరుకు చెందిన ఓ భక్తులు నమ్మకంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం సొంత విమానంలో వారం వారం వచ్చి వెళ్తున్నాడు. విషయం తెలుసుకుని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. భక్తికి అంత కట్టుబడి ఉన్నాడాని షాకవుతున్నారు. నమ్మకంతో ఆరువారాలుగా వచ్చి వెళ్తున్నాడు.
సొంత విమానం
ఇంకా ఒక వారమే మిగిలి ఉంది. కానీ సొంత విమానంలో దేవుడి కోసం ప్రత్యేకంగా వస్తుంటే భక్తులు తమ దేవుడి గొప్పతనానికి మురిసిపోతున్నారు. ఇంకా ఒక వారమే మిగిలి ఉంది. అంతేకాదు అతడు ఆలయ అభివృద్ధికి రూ. కోటి విరాళం ప్రకటించాడు. దీనిపై భక్తులు కూడా ఫిదా అవుతున్నారు. అతడి భక్తికి మెచ్చుకుంటున్నారు. దేవుడంటే ఇంత అభిమానం ఉందా అని అంటున్నారు.

రాజమహేంద్రవరం
విమానం రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయానికి వచ్చి అక్కడ నుంచి కారులో వాడపల్లికి వస్తున్నారు. భక్తి ఉంటే చాలు ఎక్కడికైనా వెళతారు. ఎంత ఖర్చయినా పెడతారు అనడానికి ఇదే నిదర్శనం. ఈ నేపథ్యంలో ఆ భక్తుడి భక్తికి పరవశం అవుతున్నారు. ఏడు వారాలు దేవుడి దగ్గరకు వచ్చి వెళ్లడమంటే మాటలు కాదు. అది కారులో కాదు ఏకంగా విమానంలో కావడమే గమనార్హం.