https://oktelugu.com/

Aiden Markram : ఓ ఇంటివాడైన ఎస్ఆర్.హెచ్ కెప్టెన్.. అమ్మాయి ఎవరో తెలుసా..?

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఓ ఇంటి వాడయ్యాడు. తాజాగా తన చిరకాల స్నేహితురాలు అయిన నికోల్ ను  ఎయిడెన్ మార్క్రమ్ వివాహం చేసుకున్నాడు.

Written By:
  • BS
  • , Updated On : July 23, 2023 / 07:34 PM IST
    Follow us on

    Aiden Markram : దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఓ ఇంటి వాడయ్యాడు. తాజాగా తన చిరకాల స్నేహితురాలు అయిన నికోల్ ను  ఎయిడెన్ మార్క్రమ్ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గడిచిన ఏడాది వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. తాజాగా వీరిద్దరి వివాహం సెంచూరియన్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో అట్టహాసంగా శనివారం జరిగింది. అయితే, ఈ వివాహాన్ని స్నేహితులు, బంధువులకు మాత్రమే పరిమితం చేశారు. కొద్దిరోజుల తర్వాత ఏర్పాటు చేయనున్న రిసెప్షన్ కు దేశ, విదేశాల్లోని క్రికెట్ స్నేహితులకు, ఇతర సన్నిహితులకు ఆహ్వానం పలకనున్నట్లు చెబుతున్నారు.
    తాజాగా జరిగిన వివాహానికి సంబంధించిన ఫోటోలను ఎయిడెన్ మార్క్రమ్ భార్య నికోల్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో ఈ విషయం బయట ప్రపంచానికి తెలిసింది. వీరిద్దరూ గడిచిన 10 ఏళ్ల నుంచి రిలేషన్ లో ఉన్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటామన్న ప్రతిపాదనను ఇళ్లల్లో పెట్టి కుటుంబ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఇకపోతే ఎయిడెన్ మార్క్రమ్ భార్య  నికోల్ సొంతంగా ఆన్లైన్లో ఓ జ్యువెలరీ స్టోర్ ను నడుపుతోంది. ఇక మార్క్రమ్ విషయానికి వస్తే స్టార్ క్రికెటర్ గా దక్షిణాఫ్రికా జట్టులో కొనసాగుతున్నాడు. అనేక లీగుల్లో ఆడుతూ భారీగానే ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో తొలిసారిగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు.
    అయితే, కెప్టెన్ గా హైదరాబాద్ జట్టును విజయ పథంలో నడిపించడంలో ఎయిడెన్ మార్క్రమ్  విఫలమయ్యాడు. ఈ ఏడాది సీజన్ లో అతడి సారధ్యంలో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. కానీ, దక్షిణాఫ్రికా టి20 లీగ్ లో మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ను ఛాంపియన్ గా నిలపడంలో మాత్రం విజయం సాధించాడు. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టును విజయవంతంగా నడిపించడంలో హెడ్ కోచ్ లారాతో ఎయిడెన్ మార్క్రమ్ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వీరిద్దరి మధ్య సఖ్యత లేకపోవడం జట్టు ప్రదర్శన ప్రభావం చూపిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హెడ్ కోచ్ లారా పై వేటు వేసేందుకు జట్టు యజమాని కావ్య మారన్ సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే వచ్చే సీజన్ నుంచి హైదరాబాద్ జట్టు ఆట తీరులో మార్పు కనిపించవచ్చని అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు.